గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని కొత్తపేట ప్రాంతాన్ని అధికారులు కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. గత మంగళవారం తెలంగాణలోని మిర్యాలగూడలో మరణించిన కొత్తపేట వాసికి అతని స్వగృహం వద్ద అంత్యక్రియలు నిర్వహించారు. మృతుని రక్త నమూనాలను పరీక్షించగా కరోనా పాజిటివ్ అని తేలింది. అప్రమత్తమైన అధికారులు.. అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రైమరీ కాంటాక్ట్స్ ఇద్దరికి కొవిడ్ సోకినట్లు నిర్ధారించారు.
ఫలితంగా ఈ ప్రాంతాన్ని అధికారులు కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. బయటి వారు లోనికి రాకుండా, లోపలి వారు బయటకు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. స్థానికులెవరూ బయటకు రాకూడదని... నిత్యావసర వస్తువులను వాలంటీర్లతో సరఫరా చేయిస్తామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి: