రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన గుంటూరు జిల్లాలోని నరసరావుపేట మండలం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయం 24వ తేదీ వరకూ మూసివేస్తున్నట్లు ఆలయ ఈఓ రామకోటిరెడ్డి తెలిపారు. నరసరావుపేట పరిధిలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
25వ తేదీ నుండి ప్రభుత్వ సూచనల మేరకు నిబంధనలతో భక్తులకు స్వామి వారి దర్శనం కల్పిస్తామని ఈవో అన్నారు.
ఇవీ చదవండి: కరోనా కలకలం.. బోసిపోయిన మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్