ETV Bharat / state

కండ్లకుంటలో ఆవిష్కరణకు సిద్ధంగా కోడెల విగ్రహం

ఈ నెల 16న దివంగత నేత, మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ ప్రథమ వర్థంతి. ఈ సందర్భంగా ఆయన స్వగ్రామమైన గుంటూరు జిల్లాలోని కండ్లకుంటలో ఏర్పాటు చేయనున్న కోడెల విగ్రహం తయారైంది.

kodela statue is ready to be set up at Kandlakunta

author img

By

Published : Sep 3, 2020, 10:43 PM IST

మాజీ సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ నెల16న ఆయన స్వగ్రామమైన గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలోని కండ్లకుంటలో ఏర్పాటు చేయనున్న విగ్రహం సిద్ధమైంది. తెనాలి సూర్య శిల్ప కళలో శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు ఈ విగ్రహాన్ని తయారుచేశారు.

గతంలో నరసరావుపేట కమ్మసత్రం, లింగారావుపాలెం, నెమలిపురిలో ఆవిష్కరించిన కోడెల విగ్రహాలను... నరసరావుపేటలో ఉన్న కోడెల శివప్రసాద్ తండ్రి కోడెల సంజీవయ్య కాంస్య విగ్రహాన్ని కూడా తామే తయారు చేశామని శిల్పులు వివరించారు.

ఇదీ చదవండి:

తెనాలిలో భగత్​సింగ్ విగ్రహం ధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.