గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో తెదేపా నేత కోడెల శివరామ్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆయన ఇంటి వద్ద పోలీసు భారీగా మోహరించారు. "చంద్రన్న ఆశయ సాధన" పేరుతో నేడు రాజపాలెం నుంచి దేవరంపాడు కొండ వరకు శివరామ్ పాదయాత్ర చేయాలని సంకల్పించారు. అయితే.. శివరామ్ పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.
దీంతో.. సత్తెనపల్లి పార్టీ కార్యాలయంలో తెదేపా నేత కోడెల శివరాం నిరసనకు దిగారు. తెదేపా హయాంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో మాజీ సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తుత వైకాపా ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలన్నారు.
వైకాపా ప్రభుత్వం కొత్త అభివృద్ధి పనులు చేపట్టకపోగా.. గత ప్రభుత్వం తలపెట్టిన వాటినైనా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అనేక ప్రమాదాలకు కారణమైన కొండమోడు-పేరేచర్ల రహదారిని విస్తరింపజేసేందుకు గత ప్రభుత్వ హయాంలో కేంద్రంతో మాట్లాడి కోడెల శివప్రసాదరావు 350 కోట్లతో రహదారి విస్తరణకు పూనుకుంటే.. ప్రస్తుత వైకాపా ప్రభుత్వం దాన్ని పక్కనపెట్టిందని దుయ్యబట్టారు. అచ్చంపేట ఫ్లైఓవర్ తోపాటుగా కోడెల చేపట్టిన దేవాలయాల అభివృద్ధిని వైకాపా ప్రభుత్వం పూర్తి చేసేలా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
వైకాపా దౌర్జన్యాలకు పాల్పడినా.. తెదేపా జెండా ఎగరవేస్తాం: మాజీ ఎమ్మెల్యే యర్రపతినేని