రైతులకు నూతన సాంకేతిక విధానాలు, యంత్ర పరికరాలు, సరికొత్త వంగడాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కిసాన్ మేళా నిర్వహించారు. గుంటూరులోని యూనివర్శిటీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో వివిధ విభాగాల వారు తాము చేపట్టిన కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పించారు. నూతన వంగడాలు, పరికరాలను ప్రదర్శించారు. వ్యవసాయ యంత్ర పరికరాలు తయారు చేసే సంస్థలు, విత్తనాలు, పురుగుమందుల కంపెనీల వారు కూడా స్టాళ్లు ఏర్పాటు చేశారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి ఎంపిక చేసిన రైతులు ఈ ప్రదర్శనకు హాజరయ్యారు.
సాగులో వస్తున్న మార్పులపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని వ్యవసాయ అధికారులు తెలిపారు. వివిధ రకాల ట్రాక్టర్లు, పంట కోత యంత్రాలు, నూర్పిడి పరికరాలు, పిచికారి యంత్రాలు, డ్రోన్లను ప్రదర్శనకు ఉంచారు. పంటమార్పిడితో పాటు నేలను సారవంతం చేసే విధానాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.
ఇదీ చదవండి