గుంటూరు జిల్లా రేపల్లె మున్సిపల్ ఛైర్పర్సన్గా కట్ట మంగ ఎన్నిక ఏకగ్రీవమయ్యారు. 19వ వార్డుకు చెందిన గుజ్జర్లమూడి ప్రశాంత్ కుమార్ను వైస్ ఛైర్మన్గా ఎన్నుకున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు పాల్గొన్నారు. ఎన్నికైన ఛైర్పర్సన్, వైస్ ఛైర్మన్లతో పాటు ఇతర వార్డు సభ్యులను ఎంపీ సత్కరించారు.
సీఎం జగన్ నాయకత్వానికి ప్రజలు పట్టంకట్టి, స్థానిక ఎన్నికల్లో పూర్తి మద్దతు ఇచ్చారని ఎంపీ మోపిదేవి అన్నారు. ప్రజా సునామీలో ప్రతిపక్షాలన్నీ కొట్టుకుపోయాయని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పుర ఎన్నికల్లో వైకాపా విజయకేతనం ఎగురవేసిందని కొనియాడారు. రేపల్లెను ఆదర్శ పట్టణంగా తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు. రోడ్ల నిర్మాణం, ఇండోర్ స్టేడియం, పాత భవనాల స్థానంలో నూతన నిర్మాణాలు చేపడతామన్నారు. త్రాగునీరు, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: