Karnataka Deputy CM DK Shivakumar Comments on YCP: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని, ప్రత్యామ్నాయ జాతీయ పార్టీ కేవలం కాంగ్రెస్ మాత్రమే ఉందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నాకు. విభజన హామీలు, ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం వంటి అంశాలపై కేంద్రంలో ఉన్న బీజేపీకి చిత్తశుద్ధి లేదని, రాష్ట్రంలో వైసీపీ కూడా ఆ దిశగా కృషి చేయడం లేదని విమర్శించారు. ప్రతి బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తే నాయకుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు.
అదే విధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని.. పెద్ద ఎత్తున ప్రజల నుంచి మద్దతు వస్తుందని డీకే శివకుమార్ అన్నారు. ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని.. కాంగ్రెస్ గెలవాలని అనుకుంటున్నారని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. కష్ట సమయంలో కూడా కాంగ్రెస్‌తో ఉన్న ప్రతి కార్తకర్తను ప్రశంసించారు. అధికారం ఒకరోజు వస్తుంది.. ఏదో ఒకరోజు పోతుందని కానీ క్రమశిక్షణ ఉన్న కార్యకర్తలు కాంగ్రెస్‌లో ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏపీలో అనుకున్న స్థాయిలో బలంగా లేకపోవచ్చని.. ఏదో ఒకరోజు కచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.
ఉద్యోగ ఉపాధ్యాయులపై వైసీపీ ప్రభుత్వ వైఖరి మారాలి: మాజీ ఎంపీ చింతా మోహన్
CWC Member Raghuveera Reddy Comments: కాంగ్రెస్ పార్టీలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఒక ట్రబుల్ షూటర్‌గా ఎదిగారని, దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఏ సమస్య తలెత్తినా పరిష్కరించేందుకు ఎప్పుడు ముందుండే నాయకుడు శివకుమార్ అనే సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి అన్నారు. విజయవాడ ఆంధ్ర రత్న భవన్లో జరిగిన మీడియా మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం శివకుమార్ పని చేస్తున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా పని చేస్తున్నారని అన్నారు. ఆంధ్రా ప్రజలకు ప్రత్యామ్నాయం లేక ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయారని.. అప్పులు చేయాలన్నా.. పరిమితి దాటిపోయి అప్పు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్రాన్ని రక్షిస్తుందన్నారు.
కాంగ్రెస్‌ను విజయపథాన నడిపిస్తున్నారని రఘువీరా రెడ్డి కొనియాడారు. కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో పునర్జీవాన్ని డీకే శివకుమార్ పోశారని పేర్కొన్నారు. ఇక ఇప్పుడు తెలంగాణలో ప్రచారాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. 2024లో దేశంలో అధికారం చేపట్టే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోందన్నారు.
జగన్ రెడ్డి అవకాశవాది - పచ్చి అబద్దాలు చెప్పడం ఆయనకే చెల్లింది: టీడీపీ మైనార్టీ సెల్
DK Shivakumar Visits Vijayawada Kanaka Durgamma Temple: అంతకుమందు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ ఛైర్మన్ కర్నాటి రాంబాబు.. శివకుమార్‌కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేసి.. అమ్మవారి ప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు.
ప్రజాధనం, ప్రభుత్వ ఉద్యోగులతో పార్టీ ప్రచారమా? : ఎంపీ రఘురామకృష్ణరాజు