ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరో లేఖ రాశారు. మొక్కజొన్న కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నాయని లేఖలో వెల్లడించారు. అధికారుల వైఖరితో కృష్ణా డెల్టా మొక్కజొన్న రైతులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయించిన రూ.2,550 మద్దతు ధర అందడం లేదని లేఖలో కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. వైకాపా నేతలు, దళారులు కొని ఎక్కువ ధరకు మార్క్‌ఫెడ్‌కు విక్రయిస్తున్నారని ఆరోపించారు. అక్రమాలు అరికట్టి మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండీ... లాక్డౌన్: లాఠీ దెబ్బలకు వ్యక్తి మృతి