తన భార్య సుహారిక మృతిపై అనుమానాలు ఉన్నాయని... ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలంటూ ఏపీ భాజపా అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు ఫణీంద్ర పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ని కలిసి వినతిపత్రం అందజేశారు.
మే 28న మాదాపూర్‌లోని బాంబే హిల్స్‌లో సుహారిక అనుమానాస్పదరీతిలో మృతిచెందారు. పోలీసులు సుహారిక బర్త్‌డే పార్టీకి వెళ్లిందని... అక్కడ కుప్పకూలిపోవడంతో ఆస్పత్రికి తెసుకెళ్లేలోపు చనిపోయిందని చెబుతున్నారు. అయితే దీనిలో వాస్తవంలేదని... అసలు అక్కడ పార్టీ జరగలేదని ఫణీంద్ర తెలిపారు. దీనిలోని వాస్తవాలు బయటకు వచ్చేలా దర్యాప్తు చేయాలని కోరుతున్న ఫణీంద్రతో మా ప్రతినిధి మాఖాముఖి.
ఇదీ చూడండి: ఏపీలో ఆ కుటుంబానికి ట్రాక్టర్ కొనిస్తా: సోనూసూద్