గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగిన సంఘటిత్ పర్వ్-2019 కార్యక్రమానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్షీ నారాయణ హాజరయ్యారు. నరేంద్ర మోదీ పాలనకు ఆకర్షితులై ప్రజలు పార్టీలో చేరుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. గతంలో తెదేపా చేసిన తప్పే వైకాపా పునరావృతం చేస్తోందని మండిపడ్డారు. గ్రామాల్లో దాడులు చేయడం ఆపకపోతే ఆ పార్టీ దుస్థితే అధికారపక్షానికీ పడుతుందని హెచ్చరించారు. ప్రభుత్వ తీరు, పల్నాడు ప్రాంతాల్లో పోలీస్హింసకు వ్యతిరేకంగా ...ఆగస్టు 16న గురజాలలో ధర్నా నిర్వహిస్తామని వెల్లడించారు.
ఇవీ చదవండి..రాష్ట్రంలో భాజపా బలపడుతోంది: కన్నా