ETV Bharat / state

ఫీవ‌ర్ స‌ర్వేను పరిశీలించిన జేసీ ప్ర‌శాంతి

author img

By

Published : May 16, 2021, 10:17 PM IST

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం, యడ్లపాడు గ్రామాల్లో కొవిడ్‌-19 ఫీవ‌ర్ స‌ర్వేను జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రశాంతి ఆదివారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. స‌ర్వేపై అధికారులకు, సిబ్బందికి పలు సూచ‌న‌లు చేసిన ఆమె... త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు.

జేసీ ప్రశాంతి ఆకస్మిక తనిఖీలు
జేసీ ప్రశాంతి ఆకస్మిక తనిఖీలు

ఫీవ‌ర్ స‌ర్వేను నిర్ల‌క్ష్యం చేస్తే చ‌ర్య‌లు తీసుకుంటామని జాయింట్ క‌లెక్ట‌ర్ ప్ర‌శాంతి తెలిపారు. య‌డ్ల‌పాడు, తిమ్మాపురం గ్రామాల‌్లో ఫీవ‌ర్ స‌ర్వేను జేసీ ప్ర‌శాంతి ఆదివారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. స‌ర్వే సిబ్బందితో మాట్లాడిన ఆమె.. ఫీవ‌ర్ స‌ర్వేపై క్షేత్ర‌స్థాయి సిబ్బందికి స‌రైన అవ‌గాహ‌న లేద‌ని.. వారికి పూర్తిస్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. ఎవ‌రైనా జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబుతో బాధ‌ప‌డుతుంటే.. వెంట‌నే వారికి ర్యాపిడ్ కొవిడ్ టెస్ట్‌లు నిర్వ‌హించాల‌ని.. పాజిటివ్ వ‌చ్చిన వారికి మెడిక‌ల్ కిట్‌లు ఇవ్వాల‌ని సూచించారు. ఇత‌ర ఆరోగ్య‌ స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్న‌వారు ఉన్నా, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది ప‌డుతున్న‌ట్లు ఎవ‌రినైనా గుర్తించినా వెంట‌నే వారిని కొవిడ్‌కేర్ సెంట‌ర్‌కు త‌ర‌లించాల‌న్నారు.

ఇవీ చూడండి…

హై టెన్షన్: గుంటూరు జిల్లా జైలుకు ఎంపీ రఘురామ తరలింపు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.