రాష్ట్రంలో పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలని.. ప్రభుత్వ భూముల అమ్మకాలను నిలిపివేయాలని జనసేన వీర మహిళలు నిరాహారదీక్ష చేపట్టారు. గుంటూరు అమరావతి రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. లాక్ డౌన్ సమయంలో వచ్చిన విద్యుత్ బకాయిలను రద్దు చేయాలన్నారు.
లక్షలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న గుంటూరు మార్కెట్ సెంటర్ ను అమ్మకానికి ఉంచడం హేయమైన చర్య అని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వ భూముల అమ్మకాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరవధిక నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: