ETV Bharat / state

రైతుకు భరోసా ఇవ్వలేని ముఖ్యమంత్రి ఎందుకు? : నాదెండ్ల మనోహర్​ - NAdendla on YSRCP

Nadendla Manohar on farmers suicides in AP: జగన్​ ప్రభుత్వం రైతులకు ఏమాత్రం భరోసా ఇవ్వలేకపోతోందని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్​ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ప్రజలను ఆదుకోలేని ముఖ్యమంత్రి ఎందుకని సూటిగా ప్రశ్నించారు. కౌలు రైతు కుటుంబాలకు భరోసా కల్పించడం కోసం పార్టీ అధినేత పవన్​.. యాత్ర చేపట్టినట్లు తెలిపారు.

Janasena Party PAC Chairman Nadendla Manohar
జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్​ నాదెండ్ల మనోహర్
author img

By

Published : Apr 21, 2022, 4:10 PM IST

NAdendla on YSRCP: వైకాపా ప్రభుత్వ హయాంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్​ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. జగన్​ పాలనలో కౌలు రైతుల ఆత్మహత్యలకు ఎలాంటి నష్టపరిహారమూ అందడం లేదన్నారు. రైతులకు ఏమాత్రం భరోసా ఇవ్వలేని ముఖ్యమంత్రి ఎందుకని నిలదీశారు. గుంటూరు జిల్లా తెనాలిలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. సర్కారు తీరుపై విమర్శలు గుప్పించారు. అన్నదాత ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పు పట్టారు. రైతు భరోసా కేంద్రాలు అంటూ.. ఆరు కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని విమర్శించారు. పంట నష్ట పరిహారం అందించడం, సబ్సిడీ ద్వారా విత్తనాలు కొనుగోలు వంటి విషయాల్లో కులం, పార్టీని చూసి ప్రభుత్వ సాయం అందిస్తున్నారని ఆరోపించారు. ఈ తరహా ప్రభుత్వ విధానాలను జనసేన వ్యతిరేకిస్తుందన్నారు.

ధైర్యంగా ఉండండి.. మీ కోసమే పవన్​ యాత్ర: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కౌలు రైతులను ఆదుకునేలా.. కౌలు రైతులు భరోసా కార్యక్రమాన్ని పార్టీ అధినేత పవన్ కల్యాణ్​ ఏర్పాటు చేశారని మనోహర్​ తెలిపారు. ఈ సందర్భంగా.. ప్రతి కుటుంబానికి తమవంతు ఆర్థిక సహాయంగా రూ. లక్ష నగదు అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమం తొలుత తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభం కానుందని.. త్వరలో గుంటూరులోనూ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలు ధైర్యంగా ఉండాలని... వారి కోసమే పవన్​ యాత్ర చేపట్టినట్లు తెలిపారు.

ఆచరణలోకి రాని ప్రభుత్వ హామీ: "ఆత్మహత్య చేసుకున్న ప్రతి కుటుంబానికి రూ.7 లక్షల నష్టపరిహారం అందిస్తానని ప్రభుత్వం ఇచ్చిన హామీ.. ఆచరణకు నోచుకోలేదు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆత్మహత్యలు పెరిగిపోయాయి. సమస్యల సృష్టికర్త సీఎం జగన్. కౌలు రైతు ఆత్మహత్య వివరాలు ప్రభుత్వం బయటకి రానివ్వడం లేదు. ఇప్పుడు పవన్ పర్యటన అనగానే.. హడావుడిగా రైతులకు ఖాతాలో రూ. రెండు లక్షలు జమచేసి జనసేన సభకు వెళ్లొద్దని అధికారులు మభ్యపెట్టడం బాధాకరం. ఇచ్చిన హామీ మేరకు ఏడు లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాలి" అని నాదెండ్ల మనోహర్​ డిమాండ్ చేశారు.

ఆదుకోలేని సీఎం ఎందుకు..?: కరెంట్ కోతలతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని నాదెండ్ల విమర్శించారు. మిగులు విద్యుత్​గా ఉన్న రాష్ట్రాన్ని ఇలా తయారు చేశారని మండిపడ్డారు. గ్రామాల్లో ప్రజలు ఎక్కడికక్కడ రోడ్డెక్కారని.. కానీ జగన్ మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు రావడంలేదని మండిపడ్డారు. ఎప్పుడూ.. సొంత సంపాదనే తప్ప ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టలేదని ఆరోపించారు. ప్రజలను ఆదుకోలేని ముఖ్యమంత్రి ఎందుకని మనోహర్​ విమర్శించారు.

ఇదీ చదవండి: సీఎం కాన్వాయ్ కోసం.. ప్రజల వాహనాల స్వాధీనమేంటి?: పవన్‌ కల్యాణ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.