ETV Bharat / state

Janasena Inauguration Day: కాజలో జనసేన ఆవిర్భావ సభ.. స్థలాన్ని పరిశీలించిన నాయకులు

janasena inauguration day: కాజలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించేందుకు పార్టీ నాయకత్వం యోచిస్తోన్నట్లు సమాచారం. అందుకోసం పార్టీ నాయకులు స్థలాన్ని పరిశీలించారు.

Janasena Inauguration Day
Janasena Inauguration Day
author img

By

Published : Feb 12, 2022, 7:18 AM IST

Updated : Feb 12, 2022, 9:00 AM IST

Janasena inauguration day: జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని (మార్చి 14) గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో నిర్వహించేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం మంగళగిరి మండలంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న రెండు స్థలాలను పార్టీ నాయకుడు, పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, చేనేత విభాగం అధ్యక్షుడు చిల్లపల్లి శ్రీనివాసులు, కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ కల్యాణం శివ శ్రీనివాసరావు (కేకే) శుక్రవారం పరిశీలించారు.

మంగళగిరి మండలంలోని కాజ టోల్‌గేట్‌ సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ స్థిరాస్తి సంస్థకు చెందిన స్థలాన్ని, డీజీపీ కార్యాలయం ఎదురుగా ఉన్న మరో స్థలాన్ని వారు చూశారు. కాజ వద్దనున్న స్థలమే సభ నిర్వహణకు అనుకూలంగా ఉంటుందని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. దీనికి సుమారు లక్ష మందికి పైగా జనం హాజరవుతారని భావిస్తున్నారు.

ఇదీ చదవండి:

Justice Venkataramana: జస్టిస్ ఎం.వెంకటరమణకు హైకోర్టు ఘన వీడ్కోలు

Last Updated : Feb 12, 2022, 9:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.