మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో... ఆ పార్టీ రాష్ట్ర న్యాయ విభాగం సమావేశమైంది. నిన్న జరిగిన పరిణామాలపై చర్చించారు. పోలీసు అధికారులు అనుమతి లేకుండా... పార్టీ కార్యాలయంలోకి చొరబడ్డారన్నారు. పవన్‌తో పాటుగా నాదెండ్ల మనోహర్, ఇతర నాయకులను బంధించటంపై... న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన న్యాయ విభాగం తీర్మానించింది. అక్రమంగా బంధించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. ఒక పార్టీ అధ్యక్షుడిని నిర్బంధించటం రాజ్యాంగ విలువలు, వ్యక్తి స్వేచ్ఛకు విరుద్దమని వ్యాఖ్యానించింది. మందడంలో పోలీస్ దుశ్చర్యలో గాయపడిన మహిళలను పరామర్శించనీయకుండా నియంత్రించడం ప్రజాస్వామ్య విలువలను మంటకలపడమేనన్నారు.
ఇవీ చదవండి