రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జగన్ నివాసానికి తితిదే అధికారులు, వేద పండితులు వచ్చారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న జగన్కు వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. సినీ నటుడు మంచు విష్ణు జగన్ నివాసానికి చేరుకున్నారు. ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. జగన్ను కలిసేందుకు నేతలు, అభిమానులు వస్తున్నా భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు లోపలికి అనుమతించటం లేదు. ముఖ్యమైన వారిని, అపాయింట్మెంట్ ఉన్నవారినే అనుమతిస్తున్నారు. జగన్కు అభినందనలు తెలిపేందుకు తెదేపా శాసనసభ్యుల బృందం ఆయన నివాసానికి రానుంది. అయితే ఇంకా అపాయింట్మెంట్ ఖరారు కాకపోవడంతో వారు జగన్ నివాసానికి బయలుదేరలేదు.
ఇదీ చదవండీ...