వైకాపా నుంచి ఐదుగురు ముస్లిం సొదరులకు టికెట్ ఇస్తే నలుగురు గెలిచారని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఓడిపోయిన ఇక్బాల్‌కు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. గుంటూరులో పోలీసు మైదానంలో ప్రభుత్వం తరఫున జరిగిన ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఆయనతోపాటు వైకాపా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మతపెద్దల ఆధ్వర్యంలో జగన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. దేవుడు రాసే రాత చాలా విచిత్రంగా ఉంటుందని జగన్ అభిప్రాయపడ్డారు. 23 మంది వైకాపా ఎమ్మెల్యేలను చేర్చుకున్న తెదేపాకు.. ఈ నెల 23న వచ్చిన ఫలితాల్లో 23 సీట్లే వచ్చాయని అన్నారు.
నాన్న కంటే మంచి పాలన అందిస్తా: సీఎం జగన్ - undefined
తన తండ్రి వైఎస్ కంటే మెురుగ్గా పరిపాలన అందిస్తానని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రాష్ట్రాభివృద్ధికోసం ముస్లిం మతపెద్దలు ప్రార్థనలు చేయాలని కోరారు. రంజాన్ మాసంలో వచ్చిన ఫలితాల్లోనే వైకాపా గెలిచిందని అన్నారు.
![నాన్న కంటే మంచి పాలన అందిస్తా: సీఎం జగన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3458920-159-3458920-1559569727875.jpg?imwidth=3840)
వైకాపా నుంచి ఐదుగురు ముస్లిం సొదరులకు టికెట్ ఇస్తే నలుగురు గెలిచారని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఓడిపోయిన ఇక్బాల్‌కు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. గుంటూరులో పోలీసు మైదానంలో ప్రభుత్వం తరఫున జరిగిన ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఆయనతోపాటు వైకాపా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మతపెద్దల ఆధ్వర్యంలో జగన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. దేవుడు రాసే రాత చాలా విచిత్రంగా ఉంటుందని జగన్ అభిప్రాయపడ్డారు. 23 మంది వైకాపా ఎమ్మెల్యేలను చేర్చుకున్న తెదేపాకు.. ఈ నెల 23న వచ్చిన ఫలితాల్లో 23 సీట్లే వచ్చాయని అన్నారు.
TAGGED:
jagan iftar