Jagan Assures to Priests in Manifesto: ముఖ్యమంత్రి జగన్ మాటలు ఎవరైనా వింటే గత ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలన్నీ అమలైపోయాయన్న భ్రమ కలుగుతుంది. కానీ.. చాలా వాటిని ఇంకా అమలు చేయకుండానే గొప్పలు చెప్పుకుంటున్నారనడానికి.. అర్చకులకు సంబంధించి మేనిఫెస్టోలో పెట్టిన హామీల అమలే ఉదాహరణ. ఇంతకాలం వాటి సంగతి పట్టించుకోని జగన్ సర్కారు.. ఇపుడు హడావిడి చేస్తోంది. దేవాలయాల్లో ధూప, దీప, నైవేద్యాలు, అర్చకుల వేతనాల కోసం పంచాయతీ జనాభాను బట్టి నెలకు 10 వేల నుంచి 35 వేల రూపాయల వరకు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఆ పంచాయతీలో ఉండే ఆలయాల సంఖ్యను బట్టి ఒక్కో దానికి కనీసం 10 వేలు చొప్పున ఇస్తామని పేర్కొన్నారు.
Priests Dharna in Gorantla సెలవు కావాలన్న అర్చకుడిపై ఆలయ కమిటీ దాడి.. ధర్నాకు దిగిన అర్చకులు
Temples DDNS Scheme in AP: ఆదాయం లేని ఆలయాలకు ధూప, దీప, నైవేద్యం కింద 5 వేల రూపాయల చొప్పున ప్రతినెలా సాయం అందించే పథకం గతం నుంచి అమల్లో ఉంది. ప్రస్తుతం 5 వేల 5 వందల ఆలయాలకు దీన్ని అమలు చేస్తున్నారు. 5 వేల రూపాయల్లో.. 2 వేల రూపాయలను ఆ ఆలయంలో నిత్యం ధూప, దీప, నైవేద్యాలకు ఖర్చు చేసి.. మిగిలిన 3 వేలను అర్చకుని భృతికి వినియోగించుకోవాలి. ఇప్పుడున్న నిత్యావసర సరుకుల ధరలను బట్టి చూస్తే.. ఏ అర్చక కుటుంబమైనా 3 వేల రూపాయలతో బతకడం అసాధ్యం. ఖర్చుల కోసం ప్రతి నెలా అప్పులు చేయాల్సిన దుస్థితి.
అర్చకులు, ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్టు బోర్డు ఏర్పాటు
Priests Salary: దీంతో డీడీఎన్ఎస్ పథకం కింద సాయం 10 వేల రూపాయలకు పెంచితే కాస్త ఊరట కలుగుతుందని వేలాదిమంది అర్చకులు ఎదురుచూస్తున్నారు. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరమే ఇది అమలవుతుందని ఆశపడ్డారు. అది నిరాశగానే మిగిలిపోయింది. వైసీపీ సర్కారు ఏర్పడి నాలుగున్నరేళ్ల కాలం అవుతున్నా.. ఇంతవరకూ అతీగతీ లేదు. 2 లక్షల రూపాయల లోపు వార్షికాదాయం ఉన్న ఆలయాల్లో.. అసలు నిర్వహణకు కూడా నిధుల్లేని వాటిని డీడీఎన్ఎస్కు ఎంపిక చేస్తున్నారు.
AP Priests Problems: కొన్ని జిల్లాల్లో కొత్తగా ఆలయాలను దేవాదాయశాఖ పరిధిలో పబ్లికేషన్ చేసి, వాటికి ఈ పథకం వర్తింపజేస్తున్నారు. అర్చకులకు స్థలాలు కేటాయించి.. వారికి ఇళ్లు కట్టిస్తామంటూ.. ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ మరో హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక చాలాకాలం దీని గురించి పట్టించుకోలేదు. తర్వాత జిల్లాల వారీగా అర్చకుల నుంచి అర్జీలు స్వీకరించగా.. దాదాపు 15 వందల వరకు వచ్చాయి. ఇప్పటివరకు 6 వందల 90 మందికే స్థలాలు కేటాయించారు.