ETV Bharat / state

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని అఖిలపక్ష ఐకాస ధర్నా

అమరావతి రాజధానిగా శంకుస్థాపన చేసి అక్టోబర్ 22కు ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా.. అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో అఖిలపక్ష ఐకాస ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం మహాత్ముని విగ్రహానికి వినతి పత్రాలు అందజేశారు.

jac protest for amaravathi
jac protest for amaravathi
author img

By

Published : Oct 22, 2020, 8:40 PM IST

రాష్ట్రానికి అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించుతానని సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని అఖిలపక్ష ఐకాస డిమాండ్ చేసింది. అమరావతినే శాశ్వత రాజధానిగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతు బజార్ ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రాలు అందజేశారు. అనంతరం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో తెదేపా, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ ,లోక్ సత్తా, నవతరం తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి; మహా పాదయాత్రతో ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి: రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.