ETV Bharat / state

ఆ కళాశాలల్లో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు ఇక లేనట్లే!

author img

By

Published : Dec 1, 2022, 10:57 AM IST

GOVT NOT INTERESTED TO GIVE FREE BOOKS TO INTER STUDENTS : ప్రభుత్వ జూనియర్​ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలు ఇప్పటి నుంచి లేనట్లే. పుస్తకాలు అందించేందుకు నిధులు లేవన్న ఇంటర్మీడియట్​ విద్యాశాఖ.. విద్యామండలిలోని డబ్బులు వెచ్చించి కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల వారికి ఇవ్వడానికి సిద్ధమైంది.

GOVT NOT INTERESTED TO GIVE FREE BOOKS TO INTER STUDENTS

BOOKS : ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించేందుకు నిధులు లేవన్న ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ.. ఇంటర్‌ విద్యా మండలిలోని నిధులను వెచ్చించి కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలు, హైస్కూల్‌ ప్లస్‌లోని వారికి పుస్తకాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. నిధులు లేవంటూ ఈ ఏడాది జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందించలేదు. ఉచిత పాఠ్య పుస్తకాలకు మొదట తితిదేను ఇంటర్మీడియట్‌ శాఖ సహాయం కోరింది.

అక్కడి నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో నిధులు లేవంటూ పుస్తకాలు ఇవ్వడం నిలిపివేసింది. పిల్లల నుంచి ఫీజుల రూపంలో వసూలు చేసిన డబ్బులను ‘నాడు-నేడు’కు ఖర్చు చేస్తోంది. నిబంధనల ప్రకారం ప్రభుత్వమే ఈ వ్యయం భరించాల్సి ఉండగా.. నిధుల కొరత పేరుతో ఇంటర్‌ విద్యామండలి నుంచి నిధులు తీసేసుకుంటోంది. జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఉచితంగా పుస్తకాలు ఇస్తే 18 కోట్ల వరకు వ్యయమవుతుంది. ఇంత మొత్తం వెచ్చించేందుకు ఆసక్తి చూపని ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ.. పిల్లల నుంచి ఫీజుల రూపంలో వసూలు చేసిన వాటిల్లో నుంచి 90 కోట్లు ‘నాడు-నేడు’కు మళ్లించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.