గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండలంలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాత గోవిందపురం రేవు సమీపంలో ఓ వ్యక్తి వద్ద 345 మద్యం సీసాలు పట్టుబడ్డాయని.. అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. వాటి విలువ రూ.52,000/- రూపాయల వరకు ఉంటుందని ఎస్సై రాజా నాయక్ తెలిపారు.
ఇదీ చదవండి: పెళ్లి పిలుపునకు వచ్చి నగలు చోరీ