రాష్ట్రంలో తెలంగాణ మద్యం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. పొరుగు రాష్ట్రం నుంచి అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నా... అమ్మకాలు మాత్రం తగ్గడం లేదు. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం పులిగడ్డవారి పాలెంలో తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న 31 మద్యం సీసాలను రేపల్లె ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రేపల్లె ఎక్సైజ్ సీఐ హెచ్చరించారు.
ఇదీ చదవండి: