ETV Bharat / state

సొమ్ము మనది కాదు - ఇచ్చేయండో 'సలహాదారు' పదవి! తనకు మేలు చేసిన సన్నిహితులకు జగన్ నజరానా - AP Latest News

Illegal Appointments of Advisors in YCP Govt: సలహాదారు.. ఇదో గురుతర బాధ్యత. సంబంధిత రంగాల్లో ఆరితేరిన, నిష్ణాతులైన వారిని ప్రభుత్వంలో భాగం చేసుకుని ప్రజలకు మంచి చేసే కార్యాక్రమాల రూపకల్పనకు వారిని వినియోగిస్తారు. కాని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మాత్రం దీనికి పూర్తి భిన్నం. గతంలో తమకు మేలు చేసినవారైతే చాలు లక్షల రూపాయల ప్రజాధానాన్ని కట్టబెడుతూ.. వారికి సలహాదారు పదవులు కట్టబెడుతోంది. అందులోనూ ఓ సామాజిక వర్గానికే ప్రాధాన్యం ఇస్తోంది.

advisors_in_ycp_govt
advisors_in_ycp_govt
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 25, 2023, 8:13 AM IST

Illegal Appointments of Advisors in YCP Govt: అస్మదీయుడా.. అయితే వేయండి వీరతాడు.. ఇది మాయాబజార్‌ సినిమాలో ఘటోత్కచుడు చెప్పే డైలాగ్‌..! అస్మదీయుడా అయితే ఇచ్చేయండో సలహాదారు పదవి..! ఇది ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చే నజరానా..! అర్హతలతో పనిలేదు. నైపుణ్యంతో సంబంధం లేదు. అయినవాడు కావడం, జగన్‌కి వీరవిధేయత ప్రదర్శించడమే ఏకైక అర్హత. ముఖ్యమంత్రి సామాజికవర్గానికి చెందినవారై ఉండటం అదనపు అర్హత. ఇవి ఉంటే చాలు జగన్‌ ప్రభుత్వంలో సలహాదారులైపోవచ్చు. అలాగని వారు ఏపీలోనే ఉండాల్సిన పనిలేదు. అస్మదీయులైతే చాలు.. పొరుగు రాష్ట్రాలో ఉంటున్నా పిలిచి పదవిచ్చేస్తారు.

ఎమ్మెల్యే టిక్కెట్‌లు, ఎమ్మెల్సీ, కార్పొరేషన్‌ల ఛైర్మన్‌లు వంటి పదవులు ఇవ్వలేనివారికి రాజకీయ పునరావాసం కల్పించేందుకు జగన్‌ ఎన్నుకున్న మార్గాల్లో సలహాదారు పదవి ఒకటి..! ‘సలహాదారు’ అన్న ట్యాగ్‌ తగిలించి అప్పనంగా ప్రజల సొమ్ముని వారికి దోచిపెడుతున్నారు. విచ్చల విడిగా సలహాదారులను నియమిస్తున్నారు. సలహాదారుల జీత భత్యాల కోసం వెచ్చించే 120 కోట్లు మరే ఇతర ప్రజోపయోగ కార్యక్రమానికైనా ఆ నిధుల్ని వెచ్చించొచ్చు..! కానీ ముఖ్యమంత్రికి ప్రజలకంటే అయినవాళ్లు, ఆస్మదీయులే ముఖ్యం..! సర్వీసులో ఉండగా సీఎం, మంత్రులు చెప్పినదానికల్లా తలాడిస్తూ.. ‘అయ్యా.. ఎస్‌’ అంటూ ఏకపక్షంగా వ్యవహరించిన ఐఏఎస్‌ అధికారుల్నీ పదవీ విరమణ తర్వాత ‘సలహాదారు’ పోస్టుతో సత్కరిస్తున్నారు. హైకోర్టు తప్పుబట్టినా లెక్కలేని జగన్‌ సర్కారు.. కోట్లలో ప్రజాధనం వృథా చేస్తోంది.

వేల కోట్ల విలువైన కాంట్రాక్టులన్నీ జగన్‌ సన్నిహితులకే- స్మార్ట్​గా దోపిడీ

రాష్ట్రంలో విచ్చల విడిగా జరుగుతున్న సలహాదారుల నియామకం చూశాక మంత్రివర్గం పరిమాణంపై పరిమితులు పెట్టినట్టే సలహాదారుల సంఖ్య కూడా ఇంత కంటే మించడానికి వీల్లేదని కేంద్ర ప్రభుత్వం కొత్తగా చట్టం తేవాల్సి వస్తుందేమో..! ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో సలహాదారులుగా ఉన్న సుమారు 56 మందిలో నలుగురో, ఐదుగురో నిజమైన నిపుణులున్నా వారు కూడా ప్రభుత్వానికి సలహా ఇచ్చేది లేదు. వారిని సలహా అడిగేవారూ లేరు. వారే కల్పించుకుని సలహా ఇద్దామనుకున్నా వినేవారు అసలే లేరు. సలహాదారు పదవి కేవలం ఒక అలంకారమే..! నెలయ్యేసరికి వచ్చే జీతభత్యాలు, కేబినెట్‌ హోదా ఉంటే ప్రభుత్వం సమకూరే నౌకర్లు, చాకర్లతో సలహాదారుల లైఫ్‌స్టైల్‌ మారుతుందేమో తప్ప వారి వల్ల ప్రభుత్వానికి పైసా ఉపయోగం లేదు.

రాష్ట్ర ప్రజలకు అంతకంటే ప్రయోజనం లేదు. మిగతా నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లోని మొత్తం సలహాదారులందర్నీ కలిపినా ఏపీలో ఉన్నంత మంది ఉండరంటే అతిశయోక్తి కాదేమో..! కొందరు సలహాదారులైతే రాష్ట్రానికి ఒకసారో, రెండుసార్లో వచ్చి ఉంటారంతే..! కొందరు పొరుగు రాష్ట్రాల్లో ఉంటూ.. ఏపీ ప్రభుత్వంలో సలహాదారు పదవులు వెలగబెడుతున్నారు. కొందరు అసలు ఎక్కడున్నారో తెలీదు. ఏ సమావేశాల్లోనూ కనిపించరు. వారు సలహాదారులుగా కొనసాగుతున్నారో లేదో సంబంధిత శాఖలో పనిచేసేవారిలోనే చాలా మందికి తెలీదు. వారు సలహా ఇచ్చేదీ లేదు వీరు వినేదీ లేదు.

సీఎం జగన్ సహా మొత్తం 41 మందికి హైకోర్టు నోటీసులు - తనకు, తన బంధుగణానికి లబ్దిచేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారన్న పిటీషనర్

సన్నిహితులకే అత్యధిక ప్రాధాన్యం.. సలహాదారుల్లోనూ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులకే అత్యధిక ప్రాధాన్యం. వారిలో సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పుతున్న సజ్జల రామకృష్ణారెడ్డిది అగ్రస్థానం. ఆయన మంత్రులకు మించిన విశేష అధికారాల్ని చలాయిస్తున్నారు. వైసీపీ విపక్షంలో ఉన్నప్పటి నుంచీ జగన్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ, మేధావులు పేరుతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో సమావేశాలు పెట్టి, అప్పటి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక భావన పెంచేందుకు తీవ్రస్థాయిలో కృషి చేసిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయకల్లంకి జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారు పోస్టు కట్టబెట్టారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో సీఎంఓలో అంతా తానై చక్రం తిప్పిన అజేయకల్లం విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు వంటి విషయాలపై విలేఖరుల సమావేశాల్లో గత ప్రభుత్వంపై విషం చిమ్మేవారు.

హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా లెక్కలేదు.. జగన్‌ ప్రభుత్వం విచ్చలవిడిగా సలహాదారుల్ని నియమించడంపై హైకోర్టు మండిపడింది. మంత్రులకు సలహాదారులంటే అర్ధం చేసుకోవచ్చుగానీ, ప్రభుత్వ శాఖలకు సలహాదారుల్ని నియమించడమేంటని నిలదీసింది. అధికారుల కొరతేమైనా ఉందా? అని ప్రశ్నించింది. సలహాదారులు రాజ్యాంగేతర శక్తులగా వ్యవహరిస్తున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. హైకోర్టు అంత తీవ్ర స్థాయిలో అభిశంసించినా రాష్ట్ర ప్రభుత్వం తీరులో మార్పు రాలేదు. ఆ తర్వాత కూడా సలహాదారుల నియామక పరంపర కొనసాగిస్తూనే ఉంది. కోట్ల రూపాయల ప్రజాధనం కట్టబెడుతున్నారు. పదవీకాలం మొత్తంలో ఒక్క సలహా అయినా ఇస్తున్నారో లేదో తెలీని సలహాదారులకు జీతభత్యాలు, ఇంటి అద్దె, కారు, సహాయ సిబ్బందికి జీతాల రూపంలో ప్రతి నెలా రూ.లక్షల్లో చెల్లిస్తోంది.

ఉదాహరణకు అంతర్రాష్ట్ర వ్యవహారాలు, జాతీయ మీడియా సలహాదారు అమర్‌నే తీసుకుంటే ఆయనకు నెలకు రూ.2 లక్షల వేతనంతోపాటు, ఇతర అలవెన్స్‌లు, సిబ్బంది జీతభత్యాలు కలిపి నెలకు రూ.3.82 లక్షలు చెల్లిస్తోంది. ఆయన పర్యటనలకు వెళ్లినప్పుడయ్యే ఖర్చు అదనం. పైగా ఆయనకు హైదరాబాద్‌ నుంచే విధులు నిర్వహించే వెసులుబాటు కల్పించింది. సలహదారుల్లో ముగ్గురు నలుగురు జీతం తీసుకోవడం లేదు. జీతభత్యాలు చెల్లిస్తున్నవారు 50 మందే అనుకుంటే ఒక్కో సలహాదారుపై సగటున నెలకు రూ.5 లక్షలు చొప్పున వెచ్చిరస్తారని అనుకున్నా.. ప్రతి నెలా సుమారు రూ.2.50 కోట్ల వరకు వృథాగా ఖర్చవుతోంది. అస్మదీయులకు ఉపాధి కల్పించేందుకు ఇలా విచ్చల విడిగా ప్రజాధనాన్ని ధారపోయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నా.. ఏమాత్రం లెక్కచేయడం లేదు.

ఉత్తరాంధ్రపై సమీక్ష కోసం - యువతకు ఉద్యోగాలనిచ్చే మిలీనియం టవర్స్‌ కబ్జా! అన్ని శాఖలు విశాఖకు తరలింపు

జీతభత్యాలు, ఇంటి అద్దె, వాహనం, సిబ్బందికి జీతాలు, పర్యటనకు వెళ్లినప్పుడు టీఏ, డీఏలు, ప్రొటోకాల్‌ ఖర్చులు.. ఇలా ఐదేళ్లలో జగన్‌ ప్రభుత్వం సలహాదారులపై సుమారు రూ.100 నుంచి రూ.125 కోట్లు వరకు ఖర్చు పెడుతోంది. ఆ డబ్బుతో 100 కిలోమీటర్లకుపైగా దెబ్బతిన్న రహదారుల్ని పునరుద్ధరించవచ్చు. లేదా అనేక గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించవచ్చు. సలహాదారుల నుంచి ఒక్క సలహానూ తీసుకున్న పరిస్ధితి లేదని ఈ పదవి చేపట్టిన వారే పెదవి విరుస్తున్నారు. సలహాదారుల కు ఉపాధి కేంద్రంగా మారిందని, పేరిట కోట్లలో ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా ప్రభుత్వం కొనసాగించడంపై ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా జగన్ సర్కారు మాత్రం వాటిని ఖాతరు చేయడం లేదు.

వైసీపీ ప్రభుత్వంలో ఉన్న సలహాదారులు..

  • జగన్‌ విపక్ష నేతగా ఉన్నప్పటి నుంచీ ఆయనకు ప్రసంగాలు రాసిపెట్టే జీవీడీ కృష్ణమోహన్‌ను కమ్యూనికేషన్స్‌ సలహాదారుగా నియమించారు. ఒకప్పుడు సాక్షి ఛానల్‌లోను పనిచేసిన దేవులపల్లి అమర్‌ను జాతీయ మీడియా, అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా నియమించారు. వీరు చాలదన్నట్టు సినీ నటుడు అలీని తీసుకొచ్చి ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారుని చేశారు. ఇప్పటికి దాదాపు అన్ని రకాల మీడియా సలహాదారులూ అయిపోయారు ఇక అంతర్జాతీయ మీడియా సలహాదారుని నియమించడం ఒక్కటే మిగిలింది.
  • జగన్‌ ప్రభుత్వంలో సలహాదారుల నియామకం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే శాననమండలిలో ప్రభుత్వ విప్‌గా పనిచేసిన గంగుల ప్రభాకర్‌రెడ్డి పదవీ కాలం ఇటీవల ముగిసింది. ఆయనకు పునరావాసం కల్పించాలి కాబట్టి ఈ ఏడాది జులైలో జలవనరులశాఖ సలహాదారుగా నియమించేశారు. ఒక రాజకీయ నాయకుడిని తీసుకెళ్లి జలవనరులశాఖ సలహా పదవి కట్టబెట్టడమేంటి? ఆయనేం సలహాలు ఇస్తారు?
  • మైనార్టీల సంక్షేమం చాలా చిన్న శాఖ. ప్రస్తుతం సెర్ప్‌ సీఈఓగా, సీసీఎల్‌ఏ సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారే మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యత నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఆ శాఖ కార్యదర్శిగా ప్రత్యేకంగా ఒక ఐఏఎస్‌ అధికారిని కేటాయించలేకపోయిందిగానీ ఆ శాఖకు జియావుద్దీన్, హబీవుల్లా, మహమ్మద్‌ అలీ బాగ్దాదీ, మద్దుబాలస్వామి అనే నలుగురు సలహాదారుల్ని నియమించింది. ఈ నాలుగూ ఫక్తు రాజకీయ నియామకాలే.
  • ఏపీఎన్‌జీవోల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన చంద్రశేఖర్‌రెడ్డి.. ఆ పదవిలో ఉండగా ఉద్యోగులకంటే, జగన్‌ ప్రభుత్వానికి చేసిన సేవే ఎక్కువన్న విమర్శలున్నాయి. దానికి బహుమానంగా పదవీ విరమణ చేసిన వెంటనే ఆయనకో సలహాదారు పదవి ఇచ్చేశారు.
  • వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరు సాంబశివారెడ్డిని జగన్‌ ప్రభుత్వం మొదట పాఠశాల విద్య, నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ కార్యదర్శిగా నియమించింది. ఒక ప్రైవేటు వ్యక్తిని, అది కూడా ఇంజినీరింగ్‌ కాలేజీ యజమానిని.. కార్యదర్శిగా నియమించడమే తప్పు..! అలాంటిది ఆయన పదవీకాలం కొన్ని రోజుల్లో ముగుస్తోందనగానే కేబినెట్‌ ర్యాంక్‌తో విద్యాశాఖ సలహాదారుగా నియమించింది. ఆయన కారు కొనుక్కునేందుకు రూ.20 లక్షలు అడ్వాన్స్‌గా ఇవ్వాలంటూ నియామక ఉత్తర్వుల్లోనే పేర్కొంది.
  • వైసీపీ నాయకుడు చల్లా మధుసూదన్‌రెడ్డిని ప్రభుత్వం మొదట రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియమించింది. రెండేళ్ల పదవీ కాలం ముగిశాక ఆయనను అదే శాఖకు సలహాదారుగా నియమించింది.
  • నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో కొత్తగా వచ్చిన పరిశ్రమలు, పెట్టుబడుల పెద్దగా ఏమీ లేకపోయినా ఏకంగా నలుగురు సలహాదారులు మాత్రం ఉన్నారు. పీటర్‌ టి.హసన్‌ అనే వ్యక్తిని ‘ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌’ సలహాదారుగా, కృష్ణ జి.వి.గిరిని ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ సలహాదారుగా నియమించిన ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించేందుకంటూ మరో ఇద్దరిని సలహాదారులుగా నియమించింది. ఆర్‌.వీరారెడ్డి, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు అల్లుడు ఎస్‌. రాజీవ్‌ కృష్ణలకు సలహాదారు పదవులు కట్టబెట్టింది.
  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండగా సీఎంఓకి అత్యంత విధేయంగా వ్యవహరించిన నీలం సాహ్నీ పదవీ విరమణ చేసిన వెంటనే సలహాదారుగా నియమించారు. ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవితో సత్కరించారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆదిత్యనాథ్‌దాస్‌ని పదవీ విరమణ చేసిన వెంటనే కేబినెట్‌ హోదాతో దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించారు.
  • మధ్య, దూరప్రాచ్య దేశాల్లో ప్రభుత్వ ప్రతినిధిగా, అలాగే సలహాదారుగా జుల్ఫీ రవ్‌ద్జీ అనే వ్యక్తిని నియమించారు. ఆయన ఎలా ఉంటారో కూడా ఈ ప్రభుత్వంలో చాలా మందికి తెలీదు. ఆయనకు కేబినెట్‌ హోదా మాత్రం ఉంది. అమెరికాలోను, ఐరోపాలోను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతినిధులున్నారు. అయితే వారికి సలహాదారు అన్న ట్యాగ్‌ లేదు.
సొమ్ము మనది కాదు - ఇచ్చేయండో 'సలహాదారు' పదవి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.