ఇన్నాళ్లు లూప్‌లో ఉన్న ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్‌కు బాధ్యతలు కేంద్రం అప్పగించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కం టాక్స్ అధికారిగా పదోన్నతి ఇచ్చింది... ఆర్థిక శాఖలోని రెవెన్యూ విభాగం. ఈనెల 25 నుంచి ఉత్తర్వులు అమలులోకి వస్తాయని పేర్కొంది. దిల్లీలోని ప్రిన్సిపల్ కమిషనర్ ఇన్‌కం టాక్స్ అధికారిగా జాస్తి కృష్ణ కిశోర్‌ను కేంద్రం నియమించింది. ఈయన విషయంలో అప్పట్లో పెద్ద దుమారమే రేగింది.
తెలంగాణకు శ్రీనివాసరాజు
తితిదే జేఈఓ శ్రీనివాసరాజును తెలంగాణకు డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన కేంద్రం. ప్రస్తుతం ఈయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో ఉన్నారు. మూడేళ్లపాటు తెలంగాణ క్యాడర్లో కొనసాగేందుకు అవకాశం ఇస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది డీఓపీటీ. జేఈఓ నుంచి తప్పుకున్న తరువాత శ్రీనివాసరాజు సెలవులో ఉన్నారు.