ETV Bharat / state

HUSBAND MURDERED WIFE: అనుమానంతో భార్యను చంపి.. ఆపై తానూ..! - ap news

భార్యపై ఓ భర్త పెంచుకున్న అనుమానం వారిద్దరి చావుకి కారణమైంది. ముందుగా భార్యని రోకలిబండతో కొట్టి చంపిన భర్త.. ఆమె చనిపోయాక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.

Husband committed suicide after killing his wife at guntur
అనుమానంతో భార్యను చంపి... ఆపై తానూ..!
author img

By

Published : Dec 21, 2021, 8:04 AM IST

Updated : Dec 21, 2021, 9:37 AM IST

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రులో దారుణం జరిగింది. భార్యపై విపరీతమైన అనుమానం పెంచుకున్న ఓ భర్త.. ఆమెను హత్య చేసి అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లాలోని పచ్చలతాడిపర్రుకు చెందిన యేసు బాబుకు, అదే మండలం వడ్డి ముక్కల గ్రామానికి చెందిన మనీషాకు 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా ఇద్దరు కుమారులు జన్మించారు. గతకొంతకాలంగా యేసు బాబు మనీషాపై అనుమానం పెంచుకున్నాడు. తరచూ అతను మనీషాతో గొడవ పడడంతో విసిగిపోయిన ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

సోమవారం సాయంత్రమే మనీషా తల్లి ఆమెను అత్తింటికి తీసుకొచ్చి నచ్చజెప్పింది. రాత్రి మళ్లీ వారిద్దరి మధ్య గొడవ జరగడంతో కోపోద్రిక్తుడైన యేసుబాబు... భార్యపై రోకలితో దాడి చేశాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో.. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. అందరూ కలిసి మనీషాను పొన్నూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. భార్య మృతి విషయం తెలుసుకున్న భర్త ఏసుబాబు భయంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇదీ చూడండి:

PEDDAPALLI ACCIDENT: ఘోర రోడ్డు ప్రమాదం.. 3 నెలల చిన్నారి సహా దంపతులు మృతి

Last Updated : Dec 21, 2021, 9:37 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.