ETV Bharat / state

How CM Jagan Cheating AP People: పథకాల్లో 'కోతలు'.. ప్రసంగాల్లో 'కోతలు'.. పెత్తందారు 'ఎవరు' జగన్​?.. - Jagan Provocative Actions For Political Benefits

How CM Jagan Cheating AP People: పేదలకు పెద్దల మధ్య యుద్ధం.. సీఎం జగన్ పదే పదే వల్లెవేస్తున్న మాటలివి. పెత్తందార్లు.. పేదవారిని రాష్ట్రం నుంచి తరిమేసే పరిస్థితి వస్తోందంటూ గుండెలు బాదుకుని మైకులు పగిలిపోయేలా అరిచి మరీ కేకలేస్తాడు. రాష్ట్రరాజకీయాలపట్ల, పాలన పట్ల అవగాహన ఉన్న వారైతే.. ఆయన ప్రసంగాలంతా కోతలే అని తేల్చిపారేస్తారు. పథకాల్లో కోతలు వేసి..తాను తప్పా విపక్షాలు, ప్రజావ్యతిరేక చర్యల్ని ప్రశ్నించే మీడియా, ప్రజాసంఘాల వారంతా..పేదలకి శత్రువులన్నట్టుగా జగన్‌ ప్రచారం చేస్తూ ప్రజల మెదళ్లలో విషబీజాలు నాటుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న ఆయనే.. అసలైన పెత్తందారనే ఘనకీర్తిని మూటకట్టుకుంటున్నారనే వాదన వ్యక్తమవుతోంది.

Jagan_Provocative_Actions_For_Political_Benefits

author img

By

Published : Aug 17, 2023, 11:03 AM IST

Updated : Aug 17, 2023, 11:27 AM IST

How CM Jagan Cheating AP People: ప్రతి సభలోనూ పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటూ వ్యాఖ్యానిస్తూ.. వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ..ఆయనే పేదల కడుపు కొట్టారు. పల్లెల నుంచి పట్టణాలకు ఉపాధి కోసం వలస వచ్చే పేద కార్మికులు, చిరుద్యోగులు, పట్టణంలోనే ఉండే అభాగ్యులకు 5 రూపాయలకే కడుపునిండా భోజనం పెట్టిన 368 అన్న క్యాంటీన్లను.. కేవలం గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్న కక్షతో రాత్రికి రాత్రే మూసేశారు. ఇది పెత్తందారి పోకడ గాక మరేంటి..?. ఎవరి మీదో ఉన్న కోపంతో పేదల నోటి దగ్గర కూడు తీసివేయడాన్ని ఏమంటారు..?. కేవలం 15 రూపాయల ఖర్చుతో మూడుపూట్ల కడుపు నింపుకునే పేదల కడుపుమీద కొట్టడాన్ని పేదల పక్షపాతమంటారా..?.

Uttarandhra Sujala Sravanthi Project: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుపై ఇచ్చిన హామీ గుర్తుందా జగన్?

YCP Government Closed Anna Canteen: ఆగస్టు 1, 2019న వైసీపీ ప్రభుత్వం పేదలకు కడుపు నింపే అన్న క్యాంటీన్లను మూసేసే నాటికి రాష్ట్రవ్యాప్తంగా 7.25 కోట్ల మంది భోజనం చేశారు. తమిళనాడులో జయలలిత ప్రారంభించిన అమ్మ క్యాంటీన్లను ఆ తర్వాత వచ్చిన స్టాలిన్‌ ప్రభుత్వం అదే పేరుతో, ఆమె ఫొటోలతోనే కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో మాత్రం అన్న క్యాంటీన్లను మూసేయడం ఫ్యాక్షన్‌ మనస్తత్వానికి పరాకాష్ఠ కాదా? ప్రవాసాంధ్రులు, స్వచ్ఛంద సంస్థలు, విపక్ష నాయకులు పేదలకు క్యాంటీన్లు ప్రారంభించి అన్నం పెడుతుంటే అడ్డుకోవడం, పోలీసుల్ని, మున్సిపల్‌ అధికారుల్ని పంపించి వాటిని పీకి పారేయడం.. ఏ విధమైన క్లాస్‌వారో జగనే చెప్పాలి?.

Jagan Government Create New Category in Medical Colleges: ప్రభుత్వమే విద్యా వ్యాపారం చేయడం.. వైద్య కళాశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను 25 శాతానికి తగ్గించి వారి సీట్లను లక్షల రూపాయలకు అమ్ముకోవడం వంటి వినూత్నమైన ఆలోచనలు జగన్‌కు గాక మరెవరికి వస్తాయి..? ఇదేనా పేదల పక్షపాత ప్రభుత్వం..? ఆ లెక్కన ప్రభుత్వ కళాశాలల్లో MBBS చదవాలంటే కోటి రూపాయల వరకు ఖర్చు చేయాల్సిందే. ఇక పీజీ పూర్తి చేయాలంటే 2,3 కోట్లు కావాల్సిందే.. అంత డబ్బు వెచ్చించి ఆయన పదేపదే చెప్పే ‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు సాధ్యమా..?’ వ్యవస్థను తిరోగమనంలోకి నెట్టేస్తున్న జగన్‌ పెత్తందారా..? లేక పేదల పక్షపాతా.?

Disha Act Not Implementing in AP: ఏపీలో దిక్కులేని 'దిశ'.. చట్టం ఎప్పుడు జగనన్నా..!

Jagan Govt Restrictions in Videsi Vidya Schems: SC, ST వర్గాలకు చెందిన పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు.. గత ప్రభుత్వం విదేశీ విద్య పేరుతో పథకాన్ని అమలు చేసింది. టీడీపీ ప్రవేశపెట్టిందన్న కారణంతో అధికారంలోకి రాగానే జగన్ దాన్ని కూడా పక్కన పడేశారు. మూడు సంవత్సరాల పాటు దాన్ని అమలు చేయలేదు. వివిధ సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో ఇటీవలే మళ్లీ ప్రారంభించినా.. వివిధ ఆంక్షలు విధించారు. సబ్జెక్టుల వారీగా టాప్‌-50 విశ్వవిద్యాలయాల్లో సీట్లు వచ్చినవారికి, అది కూడా సబ్జెక్టుల వారీగా ఆర్థిక సాయం చేస్తామంటూ మెలికపెట్టింది. దీంతో ప్రభుత్వం అందించే విదేశీ విద్య సాయం కొద్దిమందికి మాత్రమే పరిమితం కానుంది.

YCP Negligence on Best Available Schools Scheme: టాప్‌-50 విశ్వవిద్యాలయాల్లో సీట్లు సంపాదించే ప్రతిభ ఉన్న విద్యార్థుల్లో చాలా మందికి అసలు ప్రభుత్వ సాయంతోనే పనిలేదు. ఎలాగూ వారికి ఉపకారవేతనం లభిస్తుంది. ప్రభుత్వ చేయూత కావాల్సింది మధ్యస్థాయి యూనివర్సిటీల్లో సీట్లు తెచ్చుకున్న పేద, మధ్యతరగతి వర్గాల వారికే.. పేరుకు పథకం ఉన్నట్టు కనిపించాలి. కానీ పేద, మధ్యతరగతి వర్గాలకు అది ఉపయోగపడకూడదు. అదే జగన్ ప్రభుత్వ వ్యూహాం.. అర్థంలేని ఆంక్షలతో గుప్పెడు మందికి సాయం చేసి..పేదలందరినీ ఉద్ధరిస్తున్నట్లు జగన్‌ ప్రచారం చేసుకోవడమేనా పేదల పక్షపాతమంటే...? ఇప్పుడు చెప్పండి జగన్..పేదలపై యుద్ధం చేస్తోంది ఎవరో..? ప్రతిభ గల SC, ST విద్యార్థుల్ని ప్రభుత్వమే కార్పొరేట్‌ పాఠశాలల్లో చేర్పించే బెస్ట్​ ఎవైలబుల్​ స్కూల్స్​ పథకం కింద 2014-19 మధ్య లక్షా 40వేల మందికి సాయం అందిస్తే.. వైసీపీ అధికారంలోకి వచ్చాక దీన్ని కేవలం 9, 10 తరగతులకే పరిమితం చేయడమేనా పేదల పక్షపాతమంటే?.

CM Jagan Visits Polavaram Flood Victims: సీఎం జగన్ పోలవరం ముంపు ప్రాంతాల పర్యటన.. గత హామీల మూట ఏమైంది జగనన్నా..?

Jagan Government on Cinema Tickets Price: జగన్‌ వేధింపులకు పేదలే కాదు.. సినీ పరిశ్రమకు చెందిన పెద్దలూ బాధితులే. పేదవాడికి అందుబాటులో వినోదాన్ని అందించాలని సినిమా టిక్కెట్ల ధరలు తగ్గిస్తే.. దీనిపై రకరకాలుగా మాట్లాడుతున్నారంటూ గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో నిర్వహించిన బహిరంగ సభలో జగన్‌ విరుచుకుపడ్డారు. తాను మాత్రమే పేదలపక్షపాతినంటూ బిల్డప్‌ ఇచ్చారు. అయితే అసలు విషయం ఏంటంటే.. జగన్​ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా.. సినీ పరిశ్రమ ఆయనను పట్టించుకోకపోవడం, పరిశ్రమ పెద్దలెవరూ ఆయనకు సలామ్‌లు చేయకపోవడంతో ఆయనలోని పెత్తందారు నిద్రలేచాడు.

YCP Governmnet Increased the Ticket Prices: సినీ పరిశ్రమను తన కాళ్లదగ్గరకు రప్పించుకునేందుకు సినిమా టికెట్ల ధరలను భారీగా తగ్గించేసి.. పేదలను ఏదో ఉద్దరించడానికేనన్నట్లు జగన్ బిల్డప్‌ ఇచ్చారు. దీంతో సినీ పరిశ్రమ పెద్దలు ఆయన్ను కలిసి శరణుకోరడంతో ఆయనలోని పెత్తందారుడు శాంతించాడు. అప్పటి వరకు పేదలకు వినోదం అవసరం లేదా అంటూ అరిచి గోలపెట్టిన వైసీపీ ప్రభుత్వమే.. 3 నెలల్లోనే సినిమా టిక్కెట్ల ధరలు పెంచుతూ మళ్లీ ఉత్తర్వులిచ్చింది. అంటే జగన్‌ లెక్క ప్రకారం రాష్ట్రంలోని పేదలంతా మూడు నెలల్లోనే ధనవంతులైపోయారన్న మాట! ఆ తర్వాత కూడా కొందరు పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతల సినిమాలు విడుదలైన ప్రతిసారీ భారీగా ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తూనే ఉంది.

CM Jagan Meeting: గోదావరి జిల్లాల వైసీపీ నేతలతో ముఖ్యమంత్రి భేటీ..

Jagan Government Negligence on TIDCO Houses: తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరులో రాజప్రసాదాలు నిర్మించుకున్న జగన్‌.. పేదలకు మాత్రం సెంటు, సెంటున్నర స్థలం మాత్రమే కేటాయించారు. ప్రభుత్వం ఇచ్చిన ఆ స్థలంలో జగన్‌ ఇంట్లోని స్నానాల గది అంత ఇల్లు కూడా నిర్మించుకోలేరు. పేదల పక్షపాతినంటూ చెప్పుకుంటున్న జగన్‌కు పేదలకు కనీసం రెండూ, రెండున్నర సెంట్ల స్థలం ఇచ్చేందుకు ఆయనలోని పెత్తందారీ అంగీకరించలేదు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించారన్న కారణంతో టిడ్కో ఇళ్లను సైతం నాలుగు సంవత్సరాలపాటు ఎవరికీ ఇవ్వకుండా పాడుబడేట్లు చేశారు.

ఎప్పుడో NTR హయాంలో నిర్మించిన ఇళ్ల నుంచి 2011 వరకు ప్రభుత్వం వివిధ పథకాల కింద మంజూరు చేసిన ఇళ్లకు OTS పేరిట పేదల నుంచి ముక్కుపిండి 350 కోట్ల రూపాయలు వసూలు చేశారు. డబ్బులు కట్టని వారి ఇళ్లపైకి వాలంటీర్లను ఉసిగొల్పడం, డ్వాక్రా మహిళల ఖాతాల్లో నుంచి నేరుగా OTS డబ్బులు మినహాయించుకోవడం పేదల పక్షపాతమా..? ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో 2022 ఏప్రిల్‌ నుంచి OTS వసూళ్లు నిలిపివేసింది. కానీ ఇప్పటికీ డబ్బు కట్టిన వారికి రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఇవ్వలేదు.

CM Jagan Cheated People: సంక్షేమ పథకాలు అమలు చేయడం ప్రభుత్వం బాధ్యతే.. ఏ పనీ చేయలేని వారిని ఆదుకోవడంలో తప్పులేదు. కానీ DBT పేరిట లబ్ధిదారుల్ని ఎంపిక చేసి.. వారి ఖాతాలకు డబ్బు పంపించేస్తే సరిపోతుందా? ప్రజలకు ఉపాధి కల్పించి, వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? పట్టుమని వెయ్యి మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ ఒక్కటైనా ఈ నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వం తెచ్చిందా..? ప్రజలకు ఉపాధి కల్పించకుండా కేవలం ప్రభుత్వం అందించే పప్పు బెల్లాల కోసం ఎదురుచూస్తూ.. పేదలంతా ఎప్పటికీ ప్రభుత్వంపైనే ఆధారపడి ఉండాలనుకోవడం పెత్తందారీ మనస్తత్వం గాక మరేంటి..?

YS Jagan: చంద్రబాబు, పవన్ కల్యాణ్.. నాన్ రెసిడెంట్ లీడర్స్: సీఎం జగన్

YCP Raithu Bharosa Scheme Fraud: 16 లక్షల మంది కౌలు రైతులకు రైతు భరోసా కింద ఏడాదికి 13వేల 500 చొప్పున ఇస్తామని చెప్పిన జగన్‌.. ఆచరణలోకి వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మాత్రమే పరిమితం చేశారు. అంటే మిగిలిన సామాజికవర్గాల్లో కౌలు రైతులంతా ధనవంతులా? వారికి రైతు భరోసా అక్కర్లేదా? గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలకే పేర్లు మార్చేసి కొత్త పథకాల్ని ఏర్పాటు చేశామంటూ ప్రజలను భ్రమింపజేస్తూ.. ప్రజలపై ఛార్జీల భారం మోపడమేనే పేదల పక్షమంటే? బయటకు పేదల్ని ఉద్ధరిస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటూ.. వారిని అన్ని రకాలా కుంగిపోయేలా చేయడం పెత్తందారీ పోకడ గాక మరేంటి..?

YCP Illegal Sand and Soil Mafia: లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేయడం తామే కనిపెట్టామన్నంత బిల్డప్‌ ఇవ్వడం.. దీనిపై తమకే పేటెంట్‌ ఉన్నట్లు సీఎం జగన్ పదేపదే కలవరిస్తుంటారు. ప్రతిపక్షాలు దోచుకో, పంచుకో, తినుకో విధానం అమలు చేస్తున్నాయని ఆడిపోసుకుంటారు. మరి జగన్ సన్నిహితులు, వైసీపీ నేతలు దోచుకుంటున్న ఇసుక, మట్టి, మైనింగ్ మాఫియా సంగతేంటి..? కనీవినీ ఎరుగని రీతిలో ప్రకృతి సంపదను దోచేయడం భూస్వామ్య, పెత్తందారీ, దోపిడీదారి విధానం కాదా..? గత ప్రభుత్వం హయాంలో ఉచితంగా ఇచ్చిన ఇసుకను వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు నెలలపాటు మార్కెట్‌లో దొరక్కుండా చేయడంతో నిర్మాణ రంగం స్తంభించిపోయింది. సుమారు 40 లక్షల మంది భవన నిర్మాణ కూలీలు రోడ్డున పడ్డారు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం ఇసుక ధరను పెంచి అమ్మకానికి పెట్టింది. దీనిలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా.. వైసీపీ ముఖ్య నేతల జేబుల్లోకి వెళ్లేదే ఎక్కువ. పేదల పక్షాన ఉన్నవాళ్లు చేయాల్సిన పనేనా ఇది..?

CM Distribute TIDCO Houses: చంద్రబాబు, పవన్‌పై సీఎం జగన్ విమర్శలు.. సభ నుంచి వెళ్లిపోయిన ప్రజలు

రేషన్​ దుకాణాల్లో రెండు కిలోలు ఇస్తున్న కందిపప్పును కిలోకి కుదించేయడమే గాక.. ధరను పెంచేశారు. గత ప్రభుత్వ హయాంలో పండుగ సమయాల్లో ఇచ్చిన సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్‌ కానుకలను రద్దు చేయడమేనా పేదలకు మేలు చేయడమంటే ? నేతన్నను ఆదుకుంటున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. కేవలం సొంత మగ్గాలు ఉన్న చేనేత కార్మికులకే నేతన్న నేస్తం అందిస్తోంది. మరి మగ్గాలు లేని కార్మికుల పరిస్థితి ఏంటి..? ఈ రంగంపై దాదాపు మూడున్నర లక్షల మంది ఆధారపడి జీవిస్తుంటే.. కేవలం 80 వేల మందికి సాయం అందించడమేనా పేదల పక్షపాతమంటే..?

CM Jagan Comments on Class War: జగనన్న చేదోడు పథకం కింద నాయీబ్రాహ్మణులు, దర్జీలకిచ్చే ఆర్థిక సాయాన్ని కూడా షాపు ఓనర్స్​కే పరిమితం చేశారు. మరి అందులో పనిచేస్తున్న కూలీల పరిస్థితి ఏంటి..? ట్యాక్సీలు, ఆటోలు, మ్యాక్సీలు సొంతంగా నడుపుకొంటున్న ఓనర్స్​కే ప్రభుత్వం సాయం చేస్తోంది. అంతకన్నా పేదలైన వాటిని నడుపుతున్న డ్రైవర్లకు సాయం ఎవరు అందిస్తారు..? ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న విద్యుత్‌ రాయితీల్లోనూ భారీగా కోతలు విధించారు. దీన్ని పేదల జీవితాల్ని బాగు చేయడమే అంటారా? ప్రభుత్వం మద్యం ఆదాయంపై ఆధారపడటమంటే ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేయడమేనని ఎన్నికల ముందు ఊదరగొట్టిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక అందుకు భిన్నంగా వ్యవహరించారు. మద్యం ధరలు విపరీతంగా పెంచేయడం వల్ల తీవ్రంగా నష్టపోయింది పేదలే. ప్రభుత్వం విక్రయిస్తున్న నాసిరకం బ్రాండ్లతో అనారోగ్యం పాలవుతోంది పేదలే..తాగుడు బలహీనతను అడ్డం పెట్టుకుని పేదల ఆదాయం పిండుకోవడం పెత్తందారీ పోకడా? పేదల పక్షపాతమా?.

Petrol and Diesel Rates High in AP: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పెట్రోలు, డీజీలు ధరలు పెంచడం వల్ల.. పరోక్షంగా ఆ భారం పేదలపైనే పడింది. ప్రయాణ ఛార్జీలు రెట్టింపయ్యాయి. రాష్ట్రంలో అధ్వాన రోడ్లతో ఎక్కువ ఇబ్బందిపడుతోంది పేదలు, చిరువ్యాపారులే. జగన్‌ ప్రభుత్వం తీరుతో పేద ప్రజలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. ఆయన మాత్రం పేదలను ఉద్ధరిస్తున్నట్లు నిత్యం అబద్ధాలు వల్లెవేస్తుంటారు. పెత్తందారు పోకడలన్నీ ఆయనే చేస్తూ.. పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం జరగబోతోందంటూ అమాయక ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానిస్తుంటారు.

TDP leaders On Smart Meeters: మోటర్లకు స్మార్ట్‌ మీటర్లు.. ఓ పెద్ద స్కాం! ఆ వివరాలను వెల్లడించాలి: టీడీపీ

CM Jagan Cheating AP People: పెత్తందారు 'ఎవరు' జగన్

Last Updated : Aug 17, 2023, 11:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.