ETV Bharat / state

ఇళ్ల పట్టాల శిలాఫలకం ధ్వంసం..10మంది వైకాపా నేతలపై కేసు నమోదు - బాపట్ల వార్తలు

గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని వెదుళ్లపల్లి కొత్తపాలెంలో ఇళ్ల పట్టాల కార్యక్రమం ఆగింది. నివాసానికి యోగ్యంగా లేని భూమిలో లేఅవుట్లు వేశారని వైకాపా నేతల్లో ఓ వర్గం ఆరోపించింది. ఉప సభాపతి కోన రఘుపతి చేతుల మీదగా ఏర్పాటు చేసిన ఇళ్ల పట్టాల శిలాఫలకాన్ని కూల్చే వరకు వివాదం వెళ్లింది. అధికారుల ఫిర్యాదుతో పది మంది వైకాపా నేతలపై కేసు నమోదైంది.

housing plots pattas Distribution stopped
వైకాపా నేతలపై కేసు నమోదు
author img

By

Published : Jan 7, 2021, 7:54 PM IST

పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వైకాపాలో వర్గపోరుకు దారితీస్తోంది. గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని వెదుళ్లపల్లి కొత్తపాలెంలో ఉప సభాపతి కోన రఘుపతి చేతుల మీదగా ఏర్పాటు చేసిన ఇళ్ల పట్టాల శిలాఫలకాన్ని వైకాపాలో ఓ వర్గం ధ్వంసం చేసింది. దీంతో పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో ఫిర్యాదు మేరకు పది మంది వైకాపా నేతలపై వెదుళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

అసలేం జరిగింది..?

కొత్తపాలెంలో 30మంది లబ్ధిదారులకు స్థలాలు పంపిణీ చేయటానికి రెవెన్యూ అధికారులు లేఅవుట్ వేశారు. దాన్ని వ్యతిరేకిస్తూ గ్రామ పెద్దలు, వైకాపాలో ఓ వర్గం హైకోర్టును ఆశ్రయించింది. డొంక భూమి నివాసానికి యోగ్యంగా లేదని పైగా ఇక్కడ పట్టాలు ఇస్తే పంటల సాగుకు, ఉత్పత్తులు తరలించటానికి రైతులు ఇబ్బందులు పడతారని స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అంత్యక్రియలు, పిండ ప్రదానాలకు ఆ భూమిని వినియోగిస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఉప సభాపతి కోన రఘుపతిని కూడా కలిసి తమ అభ్యంతరాలు తెలియజేశారు. గ్రామానికి సమీపంలో ఎలాంటి ఇబ్బందులు లేని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసి స్థలాలు ఇవ్వాలని కోరారు.

అధికారులకు లీగల్ నోటీసులు..

అభ్యంతరం తెలిపిన భూమిలో లేఅవుట్ వేయటంతో రెవెన్యూ అధికారులకు, రైతులు ఇటీవల లీగల్ నోటీసులు ఇచ్చారు. డొంక పోరంబోకు భూమిలో ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో వైకాపా నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. వైకాపా బాపట్ల మండల అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి అనుచరుడైన కోటా ముసలారెడ్డి వర్గీయులు పట్టాల పంపిణీ విషయంలో అధికారులకు మద్దతుగా నిలిచారు. 17 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి రెండ్రోజుల కిందట పంచాయతీ కార్యదర్శి షణ్ముకరావు, వీఆర్వో అబ్రహాం సిద్ధమయ్యారు. దీనిని గమనించిన వైకాపా నాయకులు దొంతిటోయిన అయ్యప్ప రెడ్డి, కోటా ఏడుకొండలరెడ్డి, పిట్టు సుబ్రహ్మణ్యం రెడ్డి, కుంచాల సుబ్రహ్మణ్యం రెడ్డి వర్గీయులు పంచాయతీ కార్యదర్శి, వీఆర్వోను నిలదీశారు. నీరు నిలిచే ప్రాంతంలో లేఅవుట్ వేసి పట్టాలు ఇవ్వటం సరికాదని, అలా చేస్తే రైతులు ఇబ్బంది పడతారని చెప్పారు. తమ అభ్యంతరాలు పట్టించుకోకుండా హైకోర్టులో వ్యాజ్యం నడుస్తుండగా ఇళ్ల స్థలాలు ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. జేసీబీని తెచ్చి పనులు చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పనులు అడ్డుకోవటానికి ప్రయత్నించారు.

ఆగిన ఇళ్ల పట్టాల పంపిణీ..

అధికారులు మాత్రం ఉప సభాపతి చేతుల మీదగా లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయటానికి శిలాఫలకాన్ని నిర్మించి ఏర్పాట్లు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన వైకాపా వర్గీయులు శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనతో ఉప సభాపతి కోన రఘుపతి చేతుల మీదగా నిర్వహించాల్సిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది. పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారుల విధులు అడ్డుకున్నారంటూ వైకాపా నేతలపై వెదుల్లాపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది.

ఇదీ చదవండి: అన్ని దేవాలయాల్లో నిఘా ఏర్పాట్లు చేస్తున్నాం: ఎస్పీ అమ్మిరెడ్డి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.