Houses demolished in macharla: గుంటూరు జిల్లా మాచర్లలోని రైల్వే స్థలాల్లో ఆక్రమణలను.. అధికారులు కూల్చివేశారు. దాదాపు 60 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అప్పు చేసి వేసుకున్న రేకుల ఇళ్లు నేలమట్టం కావడంతో.. వారి వేదన వర్ణనాతీతంగా మారింది.
తమకు న్యాయం చేయాలని కోరుతున్న బాధితులు.. ప్రత్యామ్నాయ స్థలాలు చూపాలని వేడుకుంటున్నారు. స్థలాలు ఖాళీ చేయాలంటూ.. ఆగస్టులో నోటీసులు ఇచ్చామని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఆక్రమణల తొలగింపుతో ఉద్రిక్తత నెలకొంది.
ఇదీ చదవండి:
Sector Policing in Guntur: సెక్టార్ పోలీసింగ్.. నేరాలపై సరికొత్త నిఘా..!