ETV Bharat / state

ఇంజనీరింగ్ యువతి కేసులో ఎవర్నీ వదలం: హోమంత్రి సుచరిత - homeminister on guntur engendering case

గుంటూరు జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై సహా విద్యార్థులు లైంగికదాడికి పాల్పడిన కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. కేసులో ఇప్పటికే ఇద్దరు విద్యార్థులను అరెస్టు చేశామని అన్నారు. పోలీసు శాఖకు చెందినవారి కుమారుడు ఏ1గా ఉండటం వల్లే కేసును జాప్యం చేస్తున్నారని వస్తున్న అనుమానాలు ఆమె కొట్టిపారేశారు. చట్టం ముందు ​అందరూ సమానమేనని ఎవర్నీ వదిలే ప్రసక్తి లేదన్నారు.

ఇంజనీరింగ్ యువతి కేసులో ఎవర్ని వదలం: హోమంత్రి

author img

By

Published : Jun 30, 2020, 11:02 PM IST

గుంటూరుకు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని నగ్నవీడియోను సామాజిక మధ్యమాల్లో వైరల్ చేసిన కేసు తాజాగా అనేక మలుపులు తిరుగుతోంది. కేసులో నిందితుల అరెస్టు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వచ్చాయి. ఈ కేసులో అరెస్టు అయినా నిందితులను మీడియా ముందు హాజరుపరచలేదు. పోలీసు శాఖకు చెందిన వారి కుమారుడు ఏ1గా ఉండటం వల్లే పోలీసులు అలా వ్యవహరించారా? అనే పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

మొత్తానికి బాధిత విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గుంటూరు అర్బన్ దిశ పోలీసులు కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేయగా మరికొందరి ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. అయితే ఈ కేసులో కొందరు రౌడీషీటర్లు తలదూర్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అ కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. రౌడీషీటర్లు పాత్ర ఉన్నా ఎవరిని వదిలేదిలేదని ఇప్పటికే ఈ కేసులో ఏ-1నిందితుడు వరుణ్ తేజ్​ను అరెస్టు చేశామని జిల్లా అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి స్పష్టం చేశారు. ఈ కేసులో నిందితులను మీడియా ముందుకు ఎందుకు హాజరుపరచలేదనే ప్రశ్నకు బదులిస్తూ... నిందితులు ఎవరనేది బహిర్గతమైతే కేసు విచారణకు ఆటంకాలు వస్తాయని అలా చేశామన్నారు. ఇప్పటి వరకు ఇద్దరు నిందితులు తప్ప మరెవరూ అరెస్టు కాలేదన్నారు మరికొందరి ప్రమేయంపై విచారణ జరుగుతోందని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.