గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, మాచవరం మండలాల్లో హొం మంత్రి మేకతోటి సుచరిత పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. పిడుగురాళ్ల పట్టణంలో షాదీఖాన నిర్మాణానికి హొం మంత్రి శంకుస్థాపన చేశారు. మాచవరం మండలంలోని కొత్తగణేశునిపాడు గ్రామంలో వాటర్ ప్లాంట్, నాడు-నేడులో భాగంగా పాఠశాలలో చేపట్టిన అభివృద్ది పనులను ప్రారంభించారు.
మాచవరం మండలంలోని మల్లవోలు గ్రామంలో మార్టిన్ లూథర్ చర్చి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మండలంలోని పిల్లుట్ల గ్రామంలో కేజీవీబీ పాఠశాలలో నాడు-నేడు చేపట్టిన అభివృద్ది పనులను ప్రారంభించారు. పాఠశాల పక్కనే ఉన్న వృద్ధుల ఆశ్రమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు, అధికారులు, స్థానిక వైకాపా నాయకులు ఉన్నారు.
ఇదీ చదవండి: