వ్యవసాయ కనెక్షన్లకు మీటర్ల ఏర్పాటుతో రైతులకు మేలు జరగుతుందని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి సుచరిత అభిప్రాయపడ్డారు. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్ల ఏర్పాటుతో రైతులు నష్టపోతారన్న ప్రచారంలో వాస్తవం లేదని సుచరిత స్పష్టం చేశారు. గుంటూరు పెదపలకలూరులో ఏపీసీపీడీసీఎల్ ఛైర్మన్, సీఎండీ పద్మా జనార్దన్ రెడ్డితో కలిసి మంత్రి సుచరిత విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించారు. రైతులకు 9గంటలపాటు పగటిపూట నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సుచరిత చెప్పారు. 2,600 కోట్ల రూపాయలతో సన్న, చిన్నకారు రైతులకు ప్రభుత్వమే ఉచితంగా బోర్లు వేయనుందని చెప్పారు. పేద రైతులకు ఐదేళ్లలో రూ. 1600 కోట్లతో ప్రభుత్వం ఉచితంగా మోటార్లు ఏర్పాటు చేస్తుందని మంత్రి సుచరిత చెప్పారు.
ఇదీ చదవండి: విశాఖలో మాజీ ఎంపీ సబ్బంహరి ఇంటి దగ్గర ఉద్రిక్తత