గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడు నుంచి.. గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగించాలని కోరుతూ రైతులు పాదయాత్ర చేశారు. అటుగా ఓ కార్యక్రమానికి వెళ్తున్నహోంమంత్రి సుచరిత.. రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఛానల్ పొడిగింపునకు.. పొలాల సేకరణ చేయాలని రైతులు హోంమంత్రికి విజ్ఞప్తి చేయగా.. దానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
ఛానల్ ఆధునికీకరణ, పొడిగింపు రెండు కలిపి జరిగితేనే ఉపయోగమని, తాము ఇచ్చిన హామీ గుర్తుందని సుచరిత అన్నారు. ఛానల్ పనులు టెండర్ దశలో ఉన్నాయని తెలిపారు. వచ్చే వేసవిలో పనులు ప్రారంభిస్తామన్నారు.
ఇదీ చదవండి:
BOOBY TRAP: పోలీసులపై దాడులే లక్ష్యం.. మావోయిస్టుల కొత్త ప్లాన్