ETV Bharat / state

విధి నిర్వహణలో ఓ తల్లికి హోంగార్డు సహాయం - మహిళకు హోంగార్డు సహాయం తాజా వార్తలు

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఓ తల్లికి.. హెంగార్డు సాయం చేశారు. పట్టణంలోని ప్రసన్నాంజనేయ స్వామి రథోత్సవంలో భాగంగా.. ఓ మహిళ తలపై నీటి బిందెతో, మరోవైపు చంటిపాపతో అక్కడకు చేరుకుంది. గమనించిన హోంగార్డ్ శ్రీనివాస రావు.. మహిళ వద్దనున్న పాపను తీసుకుని మొక్కు తీర్చుకుని రమ్మని తెలిపాడు. ఆ మహిళ తిరిగి వచ్చేంతవరకు పాపను తన చేతిలోనే ఉంచుకున్న శ్రీనివాసరావుని అందరూ అభినందించారు.

home guard helps to women at piduguralla in guntur
విధి నిర్వహణలో ఓ తల్లికి హోంగార్డు సహాయం
author img

By

Published : Jan 27, 2021, 3:42 PM IST

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణ పోలీస్ స్టేషన్​లో శ్రీనివాసరావు హోంగార్డుగా.. విధులు నిర్వహిస్తున్నారు. అయితే పట్టణంలో జరిగిన.. శ్రీ పంచముఖ ప్రసన్నాంజనేయ స్వామి రథోత్సవంలో భాగంగా ఆయన అక్కడ విధులకు హాజరయ్యారు. రథోత్సవంలో భాగంగా నిర్వహించిన కలశాభిషేకనికి.. మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే స్వామివారికి అభిషేకం చేసేందుకు.. ఓ మహిళ తలపై నీటి బిందె.. మరోవైపు పసికందును ఎత్తుకుని అక్కడకు చేరుకుంది.

ఇది గమనించిన శ్రీనివాసరావు.. ఆ మహిళను చూసి తన చేతిలో ఉన్న పసికందును తన చెంతకు తీసుకున్నాడు. తన మొక్కు తీర్చుకుని రమ్మని ఆ మహిళకు చెప్పారు. అటు విధులు నిర్వహిస్తూనే ఇటు మానవత్వాన్ని చాటుకున్న శ్రీనివాసరావును చూసి ప్రజలు, తోటి సిబ్బంది అభినందించారు.

ఇదీ చదవండి: చోరీ సొత్తులో... రాబట్టింది సగమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.