గుంటూరు జిల్లా బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో... రైతులకు నాసిరకం వరి విత్తనాలు ఇచ్చిన వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. 2017-18, 2018-19 సంవత్సరాల్లో కళాశాల నుంచి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు నష్టపోయారు. బాపట్ల కళాశాల ముందు నష్టపోయిన రైతులు ఆందోళనలు నిర్వహించారు. స్పందించిన ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులు... నాసిరకం విత్తనాలు రైతులకు ఇచ్చారన్న ఆరోపణలపై అప్పట్లోనే ఏడుగురిని సస్పెండ్ చేసి... సమగ్ర విచారణకు కమిటీని నియమించారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా వర్సిటీ పాలకమండలి తాజాగా నలుగురిపై చర్యలు తీసుకుంది. కళాశాల ప్రిన్సిపల్ లోకనాథరెడ్డి, ముఖ్య శాస్త్రవేత్త పి.వి.ఎన్ ప్రసాద్‌కు ఏడాది రివర్షన్ ఇచ్చారు. అధికారులు బ్రహ్మయ్య, కిరణ్మయిలకు ఇంక్రిమెంట్ల కోత విధించారు.
ఇదీ చదవండి...