HC stay on Youtuber Case: యూట్యూబర్ కుండబద్దల సుబ్బారావుపై అనంతపురం పోలీసులు నమోదు చేసిన కేసుపై హైకోర్టు స్టే విధించింది. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాపు రామచంద్రారెడ్డిని విమర్శించారని.. వారిని సీఎం జగన్మోహన్ రెడ్డికి దూరం చేసే అసత్య ప్రచారాలు చేస్తున్నారని కె. రామాంజనేయులు అనే వ్యక్తి గుమ్మగట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు పలు సెక్షన్లపై కుండబద్దల సుబ్బారావుపై కేసు నమోదు చేశారు. కేసును కొట్టివేయాలని కోరుతూ సుబ్బారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అసత్య ప్రచారాలు చేస్తున్నారనే కారణంతో మేజిస్ట్రేట్ నుండి పర్మిషన్ తీసుకోకుండా కేసు నమోదు చేయడం చట్ట విరుద్ధమని పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. తన ఎమ్మెల్యేపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఒక కార్యకర్త రిపోర్టు ఇవ్వడం చట్ట విరుద్ధమని శ్రవణ్ కుమార్ వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 23 కి వాయిదా వేసింది.
ఇవీ చదవండి: