High Court reserved judgment on SI Events: ఎస్ఐ నియామకాలపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 56 వేల మంది దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యారు. సరిపడా ఎత్తు లేరనే నిబంధనతో 5,000 మందిని తిరస్కరించారని పిటిషనర్ న్యాయవాది జడ శ్రావణ్(Jada Shravan) హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ సంవత్సరం తిరస్కరించబడిన అభ్యర్థులందరూ 2019వ సంవత్సరంలో క్వాలిఫై అయిన అభ్యర్థులేనని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. గత సంవత్సరం క్వాలిఫై అయిన అభ్యర్థులు ఎత్తు విషయంలో ఈ సంవత్సరంలో ఎలా డిస్క్ క్వాలిఫై అవుతారంటూ ధర్మాసరం ప్రభుత్వం తరఫున న్యాయవాదిని ప్రశ్నించింది. నోటిఫికేషన్ లో తెలియపరచకుండా డిజిటల్ ఎలక్ట్రానిక్ మిషన్ ద్వారా ఎత్తుకొలిచారని న్యాయవాది తెలిపారు.
Final written exams for SI Jobs: ఎస్సై ఉద్యోగాలకు తుది రాతపరీక్షల తేదీలు ప్రకటన..
పరీక్షలు తాత్కాలికంగా వాయిదా వేయాలి..! గతంలో ఎత్తు విషయంలో క్వాలిఫై అయిన ఐదు వేల మంది అభ్యర్థులు ఈ సంవత్సరం తిరస్కరణకు గురికావడం అసంబద్ధమని న్యాయవాది వాదించారు. గతంలో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఎత్తు విషయంలో ఈ సంవత్సరం ఎలా తిరస్కరణకు గురవుతారంటూ ధర్మాసనం ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ప్రతి అభ్యర్థి విషయంలో చర్యలు తీసుకున్నామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఈ నెల 14, 15 న జరిగే మెయిన్స్ పరీక్షలు తాత్కాలికంగా వాయిదా వేయాలి అంటూ పిటిషనర్ల తరఫున జడ శ్రవణ్ కుమార్ అభ్యర్థించారు. వేలాది మంది ప్రాథమిక హక్కులు ముడిపడి ఉన్న ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాల వల్ల నోటిఫికేషన్(Notification) రద్దు పరచాలని పిటిషనర్ అన్నారు. ఇరు వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్(High Court Reserve judgment) చేసింది.
Jaibheem Party: వివేకా హత్య కేసు.. సీబీఐకి జడ శ్రవణ్ కుమార్ లేఖ.. ఏం రాశారంటే..?
14, 15 తేదీల్లో పరీక్షలు: ఇప్పటికే రాష్ట్ర పోలీస్ నియామక మండలి ఎస్ఐ( Sub Inspector) ఉద్యోగాలకు సంబంధించిన... తుది రాత పరీక్షల వివరాలను వెల్లడించింది. ఈనెల 14, 15 తేదీల్లో ప్రధాన పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు పోలీస్ నియామక మండలి ఛైర్మన్ అతుల్ సింగ్ పత్రికా ప్రకటన ద్వారా విడుదల చేశారు. ఇప్పటికే ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన 57,923 అభ్యర్ధులకు మందికి దేహధారుడ్య పరీక్షలు నిర్వహించారు. ఈ దేహధారుడ్య పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి అక్టోబర్ 14,15 తేదీల్లో తుది రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ అర్హత పరీక్షల్లో పాల్గొన్న వారిలో సుమారు 5 వేల మందిని ఎత్తు లేరనే కారణంతో పోలీస్ నియామక మండలి తిరస్కరించింది. ఈ నేపథ్యంలో తమకు అన్యాయం జరిగిందంటూ... బాధిత అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. వారి తరఫున జడ శ్రావణ్ హైకోర్టులో వాదనలు వినిపించారు.
Fake SI Arrest: నేను ఎస్ఐని.. 50 వేలు పంపించు.. అరెస్టు చేసిన పోలీసులు