ETV Bharat / state

Street Lights: "వీధి దీపాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది" - సీఆర్డీఏ కమిషనర్​ వివేక్​ యాదవ్​

High Court on Street Lights in Capital Roads: హైకోర్టుకు చేరుకునే సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, ఇతర రహదారుల్లో వీధి దీపాలు ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అయ్యిందని సీఆర్‌డీఏ తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. కోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నామన్నారు.

High Court on Street Lights in Capital Roads

author img

By

Published : Apr 25, 2023, 2:03 PM IST

High Court on Street Lights in Capital Roads: హైకోర్టుకు చేరుకునే సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, ఇతర రహదారుల్లో వీధి దీపాలు ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అయ్యిందని సీఆర్‌డీఏ తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. కోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నామన్నారు. జూన్‌ చివరికి పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై టెండర్‌ ఇప్పటికే పూర్తయిందను కోర్టుకు తెలిపారు. కర్ణాటకలో జరగనున్న ఎన్నికల్లో విధుల్లో పాల్గొనేందుకు సీఆర్డీఏ కమిషనర్​ వివేక్​ యాదవ్​ వెళ్లారని.. ఈ నేపథ్యంలో విచారణకు కోర్టు ముందు హాజరు కాలేకపోయారని కోర్టుకు విన్నవించారు. ఆయనకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని మెమో దాఖలు చేశామన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ తదుపరి విచారణను జూన్‌ 20కి వాయిదా వేశారు. ఆరోజు విచారణకు హాజరుకావాల్సిందేనని తేల్చిచెప్పారు.

విజయవాడ, మంగళగిరి, గుంటూరు నుంచి హైకోర్టుకు చేరుకునే మార్గాల్లో విద్యుత్తు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, సురక్షితమైన రహదారుల నిర్మాణం, భద్రత చర్యలు చేపట్టేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎ.వేణుగోపాలరావు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై విచారణ జరిపిన న్యాయమూర్తి.. నిర్ధిష్ట సమయంలో ఏర్పాట్లు చేయాలని సీఆర్‌డీఏ కమిషనర్‌ను ఆదేశించారు. అయితే న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంతో వేణుగోపాలరావు.. సీఆర్‌డీఏ కమిషనర్‌ వివిక్​ యాదవ్​పై కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. దానిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి.. స్వయంగా సీఆర్‌డీఏ కమిషనర్‌ హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. సోమవారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.