ETV Bharat / state

హైకోర్టులో కోడెల కుమార్తె పిటిషన్​పై... రిజర్వులో తీర్పు

author img

By

Published : Jul 12, 2019, 11:51 PM IST

మాజీ స్పీకర్ కోడెల కుమార్తె వేసిన పిటీషన్​పై వాదోపవాదనలు విన్న హైకోర్టు... మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అంశంపై తీర్పును రిజర్వులో ఉంచింది.

మాజీ స్పీకర్ కోడెల కుమార్తె పిటీషన్​...తీర్పును రిజర్వులో ఉంచిన కోర్టు

గుంటూరు జిల్లా నర్సరావుపేటలో తనపై పెట్టిన కేసును రద్దు చేయాలని కోరుతూ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్​పై వాదనలు ముగిశాయి. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అంశంపై తీర్పును రిజర్వులో ఉంచింది న్యాయస్థానం. నర్సరావుపేటకు చెందిన బుజ్జి వెంకాయమ్మ అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తనపై చీటింగ్, ఎస్సీ,ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారని పిటిషనర్ పేర్కొన్నారు. మొత్తం ఎనిమిది మంది నిందితుల్లో తనను రెండో నిందితురాలిగా పేర్కొన్నారన్నారు. పిటిషనర్​కు సంబంధం లేకపోయినా సివిల్ వివాదంలో కేసు నమోదు చేశారని ఆరోపించారు. 2014 లో జరిగిన ఘటనపై ఇప్పుడు కేసు నమోదు చేశారని తెలిపారు. దీని ఆధారంగా కేసును కొట్టేయాలని కోరారు.

పిటిషనర్​పై మొత్తం 15 కేసులు నమోదయ్యాయని ఫిర్యాదుదారు తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయకుండా పిటీషనర్ అడ్డుపడ్డారని న్యాయవాది తెలిపారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని కేసును కొట్టివేయరాదని ధర్మాసనాన్ని కోరారు. ఇరువైపుల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అంశంపై తీర్పును రిజర్వులో ఉంచారు. పిటిషనర్ పై ఉన్న 15 కేసుల వివరాలను తమ ముందు ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం.

ఇదీ చదవండి:అవినీతి అంతం... అందరి బాధ్యత: సీఎం జగన్

Intro:
నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ కు పంపగలరు.
కంట్రిబ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం
Ap_Atp_46_12_Students_Agitationa_For_Lecturars_AV_AP10004

Body:అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థులకు టిఎన్ఎస్ఎఫ్ నాయకులు మద్దతు తెలిపారు. పట్టణంలోని జాతీయ రహదారిపై బైఠాయించి ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెలరోజులు పూర్తయిందని ఇప్పటివరకు ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులకు ప్రత్యామ్నాయంగా గెస్ట్ లెక్చర్స్ ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనతో రాకపోకలకు అంతరాయం కలగటంతో పోలీసులు విద్యార్థి నాయకులను స్టేషన్ కి తీసుకెళ్లారు. పోలీసుల తీరును నిరసిస్తూ విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం అధ్యాపకుల కొరత తో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను సి ఐ.కి వివరించారు

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.