హై కోర్టు తీర్పులు, న్యాయవ్యవస్థపై బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చేసిన వ్యాఖ్యలపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. గత కొద్ది రోజులుగా ఏపీ హైకోర్టు, న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో దూషణల పర్వం సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నందిగం సురేష్... కోర్టు తీర్పులు ఓ పార్టీ అధినేత వద్ద తయారై వస్తున్నాయని ఆరోపించటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు.
రాజ్యాంగబద్ధ వ్యవస్థపై... చట్టసభ సభ్యుడిగా ఉండి ఇలాంటి విమర్శలు చేయటం సరికాదని లక్ష్మీనారాయణ అన్నారు. అందుకే సురేష్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని లోక్ సభ స్పీకర్ను కోరినట్లు వివరించారు. ఈ వ్యాఖ్యల వ్యవహారంపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా ఫిర్యాదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: