గుంటూరు జిల్లా మంగళగిరి ప్రభుత్వాసుపత్రిలోని ఎకరం స్ధలాన్ని షాపింగ్ కాంప్లెక్స్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీఓను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ మేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
చెంగయ్య పిటిషన్..
ఆస్పత్రి ఆవరణలోని ఎకరం స్ధలాన్ని షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం మంగళగిరి మున్సిపాలిటీకి ఇస్తూ ప్రభుత్వం జీఓ నెం 79ను జారీ చేయటంపై హైకోర్టులో చెంగయ్య అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.
'అలా ఎలా కేటాయిస్తారు'
మంగళగిరి ప్రజల అవసరాల కోసం నిర్మించిన ఆస్పత్రిని వంద పడకల హాస్పిటల్‌గా విస్తరించేందుకు నిర్ణయించిన స్థలాన్ని కాంప్లెక్స్ నిర్మాణానికి ఎలా ఇస్తారంటూ పిటీషన్ తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు.
'విచారణ 4 వారాలకు వాయిదా'
ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు ప్రజోపయోగకరమైన స్ధలాన్ని షాపింగ్ కాంప్లెక్స్‌కు ఎలా కేటాయిస్తారని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం జీఓ నెం 79ని సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.. ఫలితం మిగిలింది