HC DISMISSED TH IPPATAM VILLAGERS PETITION : గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామస్థులకు హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. గతంలో ఇళ్ల కూల్చివేతపై అధికారులు ఇచ్చిన షోకాజ్ నోటీసు విషయాన్ని గోప్యంగా ఉంచి మధ్యంతర ఉత్తర్వులు పొందడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి.. 14 మంది గ్రామస్థులకు రూ.లక్ష చొప్పున జరిమానా విధించిన సంగతి తెలిసిందే. అయితే ఇళ్ల కూల్చివేతలపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆ గ్రామస్థులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా విచారించిన హైకోర్టు ధర్మాసనం.. గ్రామస్థుల పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
అసలేం జరిగిందంటే:
గుంటూరు జిల్లా ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతపై ముందస్తు నోటీసులు ఇచ్చారనే నిజం దాచి.. మధ్యంతర ఉత్తర్వులు పొందడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్లు ఒక్కొక్కరికి రూ.లక్ష జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ వారు రిట్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు తాజాగా దాన్ని డిస్మిస్ చేసింది.
ఇవీ చదవండి: