మిషన్ బిల్డ్ ఏపీ కింద ఈ-వేలం ద్వారా భూముల విక్రయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ప్రభుత్వం దీనికి సంబంధించి 150 పేజీల కౌంటర్‌ను ఈరోజు ఆన్లైన్లో దాఖలు చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
కౌంటర్లోని విషయాలపై తమ అభ్యంతరాలను తెలిపేందుకు సమయం కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. న్యాయవాది అభ్యర్థన మేరకు తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది హైకోర్టు. భూములు వేలం వేసినా హైకోర్టు తీర్పు అమలు చేయాలని గతంలో మధ్యంతర ఉత్తర్వులు తదుపరి విచారణ వరకు కొనసాగుతాయని న్యాయస్థానం తెలిపింది.
ఇదీ చదవండి