MLAs Poaching Case Updates Today: తెలంగాణ ఎమ్మెల్యేలకు ఎర కేసులో సింగిల్ జడ్జి తీర్పుపై ధర్మాసనం ఎదుట అప్పీలు విచారణార్హమేనని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. సీబీఐకి బదిలీ చేయాలన్న సింగిల్ జడ్జి తీర్పును సస్పెండ్ చేయాలన్న ప్రభుత్వ అప్పీలుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాం ధర్మాసనం వర్చువల్ విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున దిల్లీ నుంచి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే వాదనలు కొనసాగించారు.
క్రిమినల్ కేసుకు సంబంధించిన అంశం కాబట్టి అప్పీలు సుప్రీంకోర్టులోనే వేయాలని, హైకోర్టు డివిజన్ బెంచ్ వద్ద విచారణ అర్హం కాదని నిందితుల తరఫున మాజీ అడ్వొకేట్ జనరల్ డీవీ సీతారామమూర్తి శుక్రవారం వాదించారు. సింగిల్ జడ్జి తీర్పు కేసుపై కాదని దర్యాప్తు చేపట్టే సంస్థపై కాబట్టి ధర్మాసనమే అప్పీలు విచారణ చేపట్టాలని దవే వాదించారు. సిట్ దర్యాప్తులో తప్పేమిటో చెప్పలేదని, కేవలం సీఎం మీడియా సమావేశాన్ని పరిగణనలోకి తీసుకోవడం తగదన్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ విధానంలో వాదనలు కొనసాగనున్నాయి.
ఇవీ చదవండి: