గుంటూరు జిల్లా వినుకొండలోని కొత్తపేట రామాలయం వీధిలో భార్యను చిత్ర హింసలకు గురి చేస్తున్న ఘటన వెలులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం మద్దలకట్ట గ్రామానికి చెందిన వెంకమ్మ అనే యువతితో ఎనిమిదేళ్ల క్రితం శివారెడ్డికి వివాహమైంది. వివాహ కట్నం కింద పది లక్షలు నగదు ఇచ్చారు. కొద్ది కాలం తర్వాత వెంకమ్మను శివారెడ్డి తరచూ మద్యం సేవించి వచ్చి కొట్టేవాడు. దీంతో మరో పది లక్షలు కూడా శివారెడ్డికి మామ అప్పుగా ఇచ్చాడు. ఇచ్చిన 10 లక్షలు ఇటీవల తిరిగి ఇవ్వమని శివారెడ్డిని అడిగాడు. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన అల్లుడు భార్య వెంకమ్మపై చేయి చేసుకున్నాడు. నిన్న రాత్రి మద్యం సేవించి దాడి చేయగా .. ఆమె తీవ్ర గాయాలపాలైంది. స్థానికులు సమాచారంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని వెంకమ్మను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి :