ETV Bharat / state

నిస్సహాయస్థితిలో ఉన్నవారిని ఆదుకుంటున్న ఆపన్నహస్తాలు - లాక్ డౌన్ తో ఇబ్బందులు న్యూస్

లాక్‌డౌన్‌ అమలుతో పంట అమ్ముకోలేక నిస్సహాయ స్థితిలో ఉన్న రైతులు... సరిహద్దులు దాటలేక మార్గంమధ్యలోనే ఉండిపోయిన కూలీలు... ఉపాధి కోల్పోయి అర్ధాకలితో జీవితాన్ని వెళ్లదీస్తున్న కార్మికులు, పేదలను ఆదుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా దాతలు ముందుకొస్తున్నారు. కఠిన పరిస్థితుల్లో ధైర్యం కోల్పోవద్దనే భరోసా ఇస్తున్నారు.

helping-hands
helping-hands
author img

By

Published : Apr 6, 2020, 7:14 AM IST

Updated : Apr 6, 2020, 11:04 AM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ వల్ల... పంటను అమ్ముకునే పరిస్థితులు లేవని దిగాలుపడుతున్న రైతులను ఆదుకునేందుకు... భారతీయ కిసాన్‌సంఘ్‌ ముందుకొచ్చింది. అరటికి ప్రభుత్వం నిర్ణయించిన రేటు కంటే 5 నుంచి 10 రూపాయలు ఎక్కువ చెల్లించాలని నిర్ణయించింది. అలా కొనుగోలు చేసిన అరటిపళ్లను పేదలు, పారిశుద్ధ్య కార్మికులు, క్వారంటైన్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న రోగులకు ఉచితంగా అందించనుంది. విజయవాడలో సోమవారం నుంచి రోజుకు వంద అరటిగెలల చొప్పున పంపిణీ చేయాలన్న నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.

లాక్‌డౌన్‌ అమలుకు విశేష కృషి చేస్తున్న పోలీసులకు... ఆహారం, జ్యూస్‌ప్యాకెట్లు, సబ్బులను ఐటీసీ అందించింది. లక్ష 20 వేల కిట్లను... డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఐటీసీ ప్రతినిధులు అందజేశారు.

లాక్‌డౌన్‌ వల్ల ఆకలితో అలమటిస్తున్న సుమారు 600 పేద కుటుంబాలకు పంతం సత్యనారాయణ ఛారిటబుల్‌ ట్రస్ట్‌... ఆహారం, కూరగాయలు అందిస్తోంది. మూగజీవాలకు ఆహారం పెట్టి దాతృత్వం చాటుకుంటోంది. పారిశుద్ధ్య కార్మికులకు పండ్లు, మాస్కులు, గ్లౌజులు అందిస్తోంది. నిరంతరం విధుల్లో ఉంటున్న పోలీసులకు మజ్జిగ, శీతలపానీయాలు, బిస్కెట్లు పంచిపెట్టింది. వాంబే గృహాల చుట్టూ తిరుగుతూ భోజన పొట్లాలు అందిస్తోంది. ఆకలిదప్పులతో దయనీయంగా మారిన మూగజీవాలకు దాణాతోపాటు తాగునీరు పెడుతున్నారు. ఈ సేవా కార్యక్రమాల్లో దాదాపు 200 మంది సభ్యులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.

తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో పనులులేకపోవటంతో ఇళ్ల వద్దనే ఉంటున్న 650 కుటుంబాలకు... వ్యవసాయమార్కెట్‌ ఛైర్‌పర్సన్‌ వాసంశెట్టి వరలక్ష్మి కూరగాయలు అందించారు. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఇంటింటికీ తిరిగి కూరగాయలను అందజేశారు. చిరతపూడిలో తెలుగుదేశం నాయకులు ఇంటింటికీ వెళ్లి కూరగాయలు ఇచ్చారు. ఆసుపత్రిలోని రోగులకు ఆహారపొట్లాలు అందించారు. కాకినాడ గ్రామీణం సర్పవరం గ్రామంలో... పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేశారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేలా పరిసరాలను పరిశుభ్రం చేస్తున్న వారికి నిత్యావసరాలు, కూరగాయలను పుల్లా చంద్రరావు ఛారిటబుల్‌ ట్రస్ట్‌ సభ్యులు అందించారు.

విజయవాడ దుర్గమ్మ ఫ్లైఓవర్‌ వద్ద పారిశుద్ధ్య కార్మికులు, అనాథ, వృద్ధులకు... ఎయిర్‌టెల్‌ టెక్నికల్‌ ఆపరేషన్స్‌ బృందం... భోజనాలు పెట్టింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ కేశినేని నాని... మాస్క్‌లు అందజేశారు. లాక్‌డౌన్‌లో అహర్నిశలూ శ్రమిస్తున్న పోలీసులు, పాత్రికేయులకు... ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, మదర్‌థెరిసా ఛారిటబుల్‌ ట్రస్ట్‌... సంయుక్తంగా నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్‌ తనవంతు సాయంగా లక్షరూపాయల చెక్కు అందజేశారు.

విశాఖలో లాక్‌డౌన్‌ విధుల్లో ఉన్న పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర సిబ్బందికి... పలు స్వచ్ఛంద సంస్థలు భోజనాలు పెట్టాయి. కరోనాపై పోరాటం చేస్తున్న వారికి ధన్యవాదాలు తెలుపుతూ... రోజుకు వెయ్యిమందికి భోజనం అందిస్తామని ప్రకటించాయి. అనకాపల్లి ఎంపీ బీవీ సత్యవతి దత్తతతీసుకున్న గణపర్తిలో... సచివాలయ ఉద్యోగులు, గ్రామవాలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులకు మాస్క్‌లు, గ్లౌజులు, శానిటైజర్లు పంపిణీ చేశారు.

ప్రకాశం జిల్లా గిద్దలూరులో 136 మంది పాత్రికేయులకు ఒక్కక్కరికి 25 కేజీల బియ్యం సహా నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే రాంబాబు అందించారు. కడప జిల్లా ఓబులవారిపల్లి మండలంలో... వైకాపా నేతలు, పోలీసులు ఏర్పాటు చేసిన ఉచితంగా కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని ఎస్పీ అన్బురాజ్‌ ప్రారంభించారు. ప్రజలు రోజూ బయటకు రాకుండా... ఇంటింటికీ కూరగాయలు అందించేలా ఏర్పాటు చేశారు.

Last Updated : Apr 6, 2020, 11:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.