ETV Bharat / state

రైతులను నిండాముంచిన వర్షాలు .. పంటలకు అపార నష్టం

గుంటూరు జిల్లా రైతును వరుణుడు మరోసారి ముంచాడు. చాలా చోట్ల పంటలు దెబ్బతినిఅపార నష్టం వాటిల్లింది. వానలు తగ్గాక ప్రభావాన్ని అంచనా వేస్తామంటున్న అధికారులు.. రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మిగిలిన పంటలు కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.

గుంటూరు జిల్లాలో బారీ వర్షం
గుంటూరు జిల్లాలో బారీ వర్షం
author img

By

Published : Sep 5, 2021, 1:30 PM IST

గుంటూరు జిల్లాలో రైతులను నిండాముంచిన వర్షాలు

గుంటూరు జిల్లాలో ఖరీఫ్ సాఫీగా ప్రారంభమైనా.. కొద్ది రోజులుగా కురుస్తున్నవర్షాలతో అన్నదాతలో ఆందోళన కనిపిస్తోంది. సాధారణ సాగు విస్తీర్ణంలో... ఇప్పటికే 60 శాతం మేర నాట్లు పడ్డాయి. జిల్లాలో లక్షా 20 వేల హెక్టార్లలో... ఇప్పటికే వరి సాగుచేస్తున్నారు. పెదకూరపాడు, క్రోసూరు, అచ్చంపేట, దాచేపల్లి, వెల్దుర్తి మండలాల్లో కుండపోత వర్షాలకు వరి పూర్తిగాదెబ్బతింది. వాగులు ఉప్పొంగి పొలాల్ని ముంచెత్తాయి. పేరేచర్ల, మేడికొండూరులో.. కొండల పైభాగం నుంచి ప్రవాహం అధికంగా రావడం వల్ల.. తుళ్లూరు, తాడికొండ, అమరావతి మండలాల్లో నూర్పిడికి సిద్ధంగా ఉన్న అపరాల పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల పత్తి, మిర్చి 4 రోజులుగా నీటిలోనే నానుతున్నాయి. వర్షం పూర్తిగా తగ్గితేకానీ పంట నష్టాలు అంచనా వేయలేమని.. అధికారులు చెప్తున్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మిగిలిన పంటలు పూర్తిగా నష్టపోకుండా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. .

అధికారులు త్వరగా పంట నష్టాన్ని లెక్కించి.. తమకు పరిహారం ఇప్పించాలని రైతులు కోరుతున్నారు..

ఇదీ చదవండి: Candle Rally: 'దిశ పేరుతో ప్రచారం..ప్రజలకు వైకాపా చేసిందేమీ లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.