ETV Bharat / state

గుంటూరు జిల్లాను ముంచెత్తుతున్న వర్షం.. నీటిలో నానుతున్న పంటలు

గుంటూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడచిన 24 గంటల్లో జిల్లాలో సగటున 64.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్నిచోట్ల వరిపంట నీట మునిగింది. పత్తి, మిర్చి పొలాల్లో నీరు నిలిచింది.

heavy rains guntur district
గుంటూరు జిల్లాలో వర్షాలు
author img

By

Published : Sep 26, 2020, 7:22 PM IST

heavy rains guntur district
గుంటూరు జిల్లాలో వర్షాలు

గుంటూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షానికి వినుకొండ సీతయ్యనగర్‌లో పెంకుటిల్లు కూలిపోయింది. రాజధాని గ్రామాల్లో గతరాత్రి ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దీంతో తుళ్లూరు మండలం పెదపరిమి వద్ద వాగు పొంగిపోర్లుతోంది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బాపట్లలో కుండపోత వర్షం కురిసింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా బాపట్లలోనే 157.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గుంటూరు నగరంలోని 3 వంతెనలు, పాతగుంటూరు శివారు ప్రాంతాలు వర్షానికి జలమయంగా మారాయి. జిల్లాలో 57 మండలాల్లోనూ వర్షం కురిసింది.

మండలాల వారీగా వర్షపాతం

బాపట్లలో అత్యధికంగా 157.2, పిట్టలవానిపాలెం 149.2, తుళ్లూరు 137.6, పెదకాకాని 135.4, కర్లపాలెం 110.2, నగరం 110.2, మంగళగిరి 103.2, చిలకలూరిపేట 101.4, కొల్లిపర 95.4, వట్టిచెరుకూరు 87.8, చెరుకుల్లి 87.6, కొల్లూరు 86.8, రొంపిచర్ల 85, గుంటూరు 83, పెదనందిపాడు 82.6, కాకుమాను 82.4, దుగ్గిరాల 76.4, ఈపూరు 75.8, నిజాంపట్నం 75.2, వేమూరు 72.4, సత్తెనపల్లి 67.4, చేబ్రోలు 66.2, వినుకొండ 64.6, రేపల్లె 64, తెనాలి 62.2, భట్టిప్రోలు 59.2, తాడేపల్లి 58.8, నాదెండ్ల 54.6, చుండూరు 53.4, తాడికొండ 52, ఫిరంగిపురం 51.4, పొన్నూరు 50.6, ప్రత్తిపాడు 50.2, నూజెండ్ల 50, నకరికల్లు 48.4, మేడికొండూరు 48.2, అమృతలూరు 46.4, మాచర్ల 45.8, నరసరావుపేట 45.4, యడ్లపాడు 45.2, కారంపూడి 42.2, అమరావతి 41.8, ముప్పాళ్ల 41.8, శావల్యాపురం 41.2, దాచేపల్లి 40.2, పెదకూరపాడు 40, గురజాల 37.6, దుర్గి 36.7, బొల్లాపల్లి 36.4, పిడుగురాళ్ల 36.4, రెంటచింతల 35.4, క్రోసూరు 33.8, అచ్చంపేట 27.6, రాజుపాలెం 25.2, మాచవరం 22.6, వెల్దుర్తి 22, బెల్లంకొండ 14.2 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది.

ఉద్ధృతంగా కొంకేరు వాగు

గుంటూరు జిల్లా శావల్యాపురం మండలంలో జోరుగా కురిసిన వర్షాలకు పిచికలపాలెం, చిన్నకంచర్ల గ్రామం మధ్య ఉన్న కొంకేరు వాగు పొంగి పొర్లుతోంది. దీంతో ఇరు గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వాగు ఉద్ధృతికి సుమారు 100 నుంచి 200 ఎకరాల వరి పంట నీట మునిగినట్లు రైతులు తెలిపారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

పంటపొలాల్లో నీరు

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు , వట్టిచెరుకూరు, పెదనందిపాడు , కాకుమాను మండలాల్లో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తూనే ఉంది. మిర్చి, పత్తి పొలాల్లో నీరు నిలిచింది. రహదారులు జలమయమై ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. నల్లమడ వాగులో నీటి ఉధృతి పెరిగింది. పై నుంచి వర్షపు నీరు భారీగా చేరుతున్నందున వాగులో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. రైతులు పొలాల వద్దకు వెళ్లి నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు.

పొంగిపొర్లుతున్న వాగులు

తుళ్లూరు మండలం పెదపరిమి-తుళ్లూరు మధ్య ఉన్న కొటేళ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్త్తోంది. దీంతో తుళ్లూరు-పెదపరిమి మధ్య రాకపోకలు స్తంభించాయి. వాగులో చిక్కుకున్న కారును స్థానికులు ట్రాక్టర్ సాయంతో బయటకు తీశారు. వాగు వద్ద పోలీసుల పహారా ఏర్పాటు చేశారు. భారీ వాహనాలను మినహా మిగిలిన వాటిని అనుమతించడం లేదు.

ఇవీ చదవండి..

సమాధుల తొలగింపు.. క్షమాపణ చెప్పిన కమిషనర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.