ETV Bharat / state

Snow fall: రాష్ట్రాన్ని కప్పేసిన పొగమంచు.. ఆందోళనలో ప్రజలు - weather

ఆంధ్ర రాష్ట్రాన్ని పొగమంచు కమ్మేసింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పొగమంచు కప్పుకుపోయి దారి కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

heavy-fog-on-some-places-at-ap
రాష్ట్రాన్ని కప్పేసిన పొగమంచు.. ఆందోళనలో ప్రజలు
author img

By

Published : Dec 29, 2021, 10:06 AM IST

రాష్ట్రాన్ని కప్పేసిన పొగమంచు.. ఆందోళనలో ప్రజలు

Snow fall in AP: గత కొద్ది రోజులుగా రాష్ట్రాన్ని పొగమంచు కప్పేస్తోంది. ఉదయం పదవుతున్నా పొగమంచు కారణంగా ఏమీ కనిపించడం లేదు. పాఠశాలలకు, కార్యాలయాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారులకు రోడ్డు కూడా కనిపించక.. వాహనాల లైట్లు వేసుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు.

Low temperatures: విశాఖ జిల్లాలోని పాడేరు ఏజెన్సీలో పొగమంచు దట్టంగా కమ్మేసింది. మినుములూరులో 11, పాడేరులో 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ప్రకాశం జిల్లా చీరాల పట్టణాన్ని కూడా మంచు ముంచేసింది. ఉదయం 9 గంటలు దాటినా మంచు వీడటం లేదు. పొగమంచు కారణంగా వాహనదారులంతా మెళ్లిగా ప్రయాణం చేస్తున్నారు.

గుంటూరు జిల్లా కాకుమాను, పెదనందిపాడు, ప్రత్తిపాడు ప్రాంతలలో లంబసింగిని తలపించేలా మంచు కురుసింది. కొన్ని గంటల పాటు మంచు వర్షం కురిసినట్లుగా పడుతూనే ఉంది. ఉదయం 5 గంటల నుంచి 9 వరకు మంచు దట్టంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది.

ఇదీ చూడండి:

CBN LETTER TO DGP: 'వంగవీటి రాధకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.