పులిచింతల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం 5లక్షల క్యూసెక్కుల వరదనీరు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. పులిచింతల ప్రాజెక్టు 18గేట్లు ఎత్తి 5లక్షల 32వేల క్యూసెక్కుల నీటిని దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 8వేల క్యూసెక్కులను కేటాయించారు. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 44.03 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటం, గేట్లు ఎత్తడంతో దిగువ ప్రాంతాల వారిని అధికారులు అప్రమత్తం చేశారు. అయితే ఉదయంతో పోలిస్తే వరద ప్రవాహం కొంత మేర తగ్గింది.
ఇదీ చూడండి. భారీ వర్షాలకు నిండా మునిగిన భాగ్యనగరం