ETV Bharat / state

నిలకడగానే వారి ఆరోగ్య పరిస్థితి: వైద్యారోగ్య కమిషనర్ - కొలకలూరు న్యూస్

గుంటూరు జిల్లా కొలకలూరు గ్రామంలో వైద్యారోగ్య కమిషనర్ జే నివాస్ పర్యటించారు. గ్రామస్తుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్పారు. వైద్య సిబ్బంది గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ ప్రజల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతానికి తెనాలి మున్సిపాలిటి నుంచి గ్రామానికి నీళ్లు అందిస్తున్నట్లు తెలిపారు.

వైద్యారోగ్య కమిషనర్
వైద్యారోగ్య కమిషనర్
author img

By

Published : Jul 2, 2022, 3:37 PM IST

ప్రస్తుతం కొలకలూరు గ్రామ ప్రజల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యారోగ్య కమిషనర్ జే నివాస్ స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డితో కలిసి ఆయన గ్రామంలోని డ్రైనేజీలను పరిశీలించారు. పారిశుద్ధ్య స్థితిగతులపై స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాగునీటికి కోసం ఏర్పాటు చేసిన ఓవర్​హెడ్ ట్యాంకను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం అనారోగ్యానికి గురైన బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. వైద్య సిబ్బంది గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ ప్రజల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతానికి తెనాలి మున్సిపాలిటి నుంచి గ్రామానికి నీళ్లు అందిస్తున్నట్లు తెలిపారు.

ఏం జరిగిందంటే..: గుంటూరు జిల్లా కొలకలూరులో అతిసారం ప్రబలింది. గురువారం (జూన్ 30న) ఓ బాలిక మృతి చెందటంతోపాటు సుమారు 50 మంది వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయ్యారు. గ్రామంలో సరైన పారిశుద్ధ్య చర్యలు లేకపోవటం, మురుగునీటి కాల్వలో తాగునీటి పైపులైన్లు ఉండటం వల్లే సమస్య తలెత్తినట్లు స్థానికులు వాపోయారు. ఎస్సీ కాలనీకి చెందిన శ్రీనిధి అనే బాలిక వాంతులు, విరేచనాలతో గురువారం మృతి చెందింది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా కాలనీ వాసులు అస్వస్థతకు గురయ్యారు. కొలకలూరు ఆరోగ్య కేంద్రంతోపాటు.. తెనాలి ప్రభుత్వాసుపత్రికి వరుసకట్టారు. అప్రమత్తమైన అధికారులు గ్రామంలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గుంటూరు జీజీహెచ్​లో కొలకలూరు బాధితుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు.

గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశాం. ప్రస్తుతం డయేరియా అదుపులోకి వచ్చింది. మంచినీరు‌, ఆహారం నమూనాలు సేకరించి ల్యాబ్​కు పంపించాం. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు -విడదల రజిని, మంత్రి

పంచాయతీలకు నిధులు లేకపోవడం వల్లే పారిశుద్ధ్యాన్ని గాలికి వదిలేశారని విమర్శలు వస్తున్నాయి. తాగునీటి పైప్​లైన్లు మరమ్మత్తులు చేయటం లేదని.. ట్యాంకులు కూడా శుభ్రం చేయడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.